టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తొలి సినిమా రాజకుమారుడు నుండి మొన్నటి మహర్షి వరకు ఒక్కొక్క సినిమాతో తన పేరు, క్రేజ్ మరియు మార్కెట్ వాల్యూ ని మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ కు కేవలం టాలీవుడ్ లోనే కాక పలు ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆయన నటించిన సినిమాలు అటు తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అయితే వాటితో పాటు నార్త్ లో కూడా మన సూపర్ స్టార్ కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. వాస్తవానికి ఇప్పటివరకు తెలుగు తప్పించి మరొక వేరే భాషా సినిమాలో నటించని మహేష్ కు, 

బాలీవుడ్ మరీ ఎక్కువగా క్రేజ్ ఉండడం ఆశ్చర్యకరం. ఇకపోతే ఇటీవల కొన్నేళ్లుగా ఇండియా స్థాయిలో నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ పోటీల్లో బాలీవుడ్ హీరోలకు ధీటుగా ఆయన కూడా ఒకింత ముందు వరుసలో నిలవడమే అందుకు నిదర్శనం. ఇక ఈ ఏడాది ఏకంగా ఫరెవర్ డిజైరబుల్ అనే ఖ్యాతి సాధించిన మహేష్ బాబు, ఒక్క హిందీ సినిమాలో నటిస్తే చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. స్వతహాగా హాలీవుడ్ రేంజ్ హీరోల గ్లామర్ మరియు ఫిజిక్ ఉన్న మహేష్ కు అక్కడి హీరోయిన్స్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం విశేషం. కానీ ఆయన మాత్రం బాలీవుడ్ కి వెళ్ళడానికి ఎప్పటినుండో విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, కొద్దిరోజుల నుండి ఆయన సతీమణి నమ్రత గారిని మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కోసం కోసం
కొందరు అక్కడి దర్శక, నిర్మాతలు సంప్రదిస్తున్నారని, అయితే వారి నుండి కథలు వినడానికి మహేష్ మాత్రం పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని టాక్ వినపడుతోంది. 

ఇక మొదటి నుండి తనకు తెలుగు సినిమా అంటేనే ప్రాణమని చెప్తున్న మహేష్, ఎప్పుడూ ఇక్కడే సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే అనేకమార్లు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇప్పటికిప్పుడు కాకపోయినా సరైన సమయం వచ్చినపుడు బాలీవుడ్ లోకి తప్పకుండా మహేష్ అడుగుపెడతారని, అయితే దానికి మరికొంత సమయం ఉందని ఆయన సన్నిహితులు కొందరు ఈ విషయమై మాట్లాడినట్లు సమాచారం. ఏమైనా, ఈ విధంగా మహేష్ బాలీవుడ్ సినిమా అవకాశాలు వస్తున్న వదులుకోవడం అనేది మహేష్ ఫ్యాన్స్ కు కొంత షాకింగ్ వార్తే అని చెప్పాలి. కాగా దీనిపై పూర్తి నిజానిజాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: