మొన్న విడుదలైన ‘ఏడు చేపల కథ’ మూవీకి భయంకరమైన నెగిటివ్  రివ్యూలు రావడంతో పాటు ఆ మూవీని దయచేసి చూడవద్దు అంటూ కొందరు ఓపెన్ గానే కామెంట్స్ చేసినా ఈ మూవీకి వస్తున్న కలక్షన్స్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. దీనితో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అడల్ట్  కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  

ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ దగ్గర నుంచి ఈ మూవీ పక్కా బూతు సినిమా అన్న విషయం నిర్ధారణ అయిపోయింది. ఇలా పక్కా అడల్ట్ కంటెంట్‌తో వస్తున్నామని ముందుగానే చెప్పిన 'ఏడు చేపల కథ' చిత్ర యూనిట్ కమర్షియల్‌గా క్లిక్ అయ్యింది. A సర్టిఫికేట్ చిత్రాలను ఇష్టపడే అభిమానులు తొలి రోజే ఈ సినిమాకు నీరాజనం పలికారు అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాను ఏకంగా మన తెలుగు రాష్ట్రాలలో భారీగా 500 స్క్రీన్స్‌పై విడుదల చేయడంతో ఈ మూవీ మొదటిరోజునే 1.9 కోట్లు కొల్లగొట్టడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈ మూవీ చూసి వచ్చిన ప్రేక్షకులు బూతు సినిమా అని చెపుతున్నా పట్టించుకోకుండా ఈ మూవీ రెండవ రోజున కూడ బాక్సాఫీస్ దగ్గర 90 లక్షలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు సమాచారం ఇస్తూ ఉండటంతో ప్రేక్షకులు అభిరుచి ఇలా మారిపోయిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఈరోజు ఆదివారం శెలవు రోజు కావడంతో మరింత మెరుగైన కలక్షన్స్ వస్తాయి అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని కోటి రూపాయల్ బడ్జెట్ తో తీసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా విడుదలైన రెండవ రోజు నుండే లాభాలలోకి రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి అందరి మైండ్ బ్లాంక్ అయిపోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: