తెలుగు ప్రేక్షకుల్లో రానా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దగ్గుపాటి వారసుడిగా టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు  రానా. మొదట్లో హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ నటనకు ప్రాధాన్యమున్న ఏ పాత్రని వదులుకోవడం లేదు రానా . ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకి ప్రాణం పోసి నటించగల సత్తా రానా సొంతం . ఎలాంటి హావభావాలు నైనా తన ముఖంలో పలికించగల గొప్ప నటుడు రానా. నేనే రాజు నేనే మంత్రి సినిమా లో తన నట విశ్వరూపం చూపించినా రానా... ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 సినిమాలో బల్లాల దేవుని పాత్రలో  తన పవరేంటో చూపించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాల్లో  చంద్రబాబు పాత్రలో నటించిన రానా.... నిజమైన చంద్రబాబు ని మరిపించేలా నటించాడు. ఇలా తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. 



 అయితే గత కొంత కాలంగా రానా   ఎక్కడా కనిపించడం లేదు. ఈమధ్య విడుదలైన రానా ఫోటోలు కూడా అభిమానుల్లో కలవరపెడుతున్నాయి.రానా  ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు కూడా హల్ చల్ చేశాయి. రానా  ఆరోగ్యంపై సురేష్ బాబు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లన్నిటికి  చెక్  పెట్టారు. అయితే సురేష్ బాబు  క్లారిటీ ఇచ్చినప్పటికీ రానా మాత్రం ఎక్కడా తెరపై కనిపించడం లేదు. ఇదిలా ఉండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా  హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హీరో గా ఎంట్రీ ఇస్తున్న సినిమా నేడు ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ  కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాణా సందడి చేసారు. అయితే ఇటీవలే అమెరికా వెళ్ళిన రానా  తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం లో సందడి చేశారు. నవ్వులు చిందిస్తూ అందరితో సందడి చేస్తూ కనిపించారు. 



ఈ సినిమా  ఓపెనింగ్ షాట్ కు రానా కెమెరా స్విచ్చాన్ చేసినట్లు సమాచారం. మహేష్ బాబు కుటుంబం నుంచి టాలీవుడ్ కి హీరోగా  ఎంట్రీ ఇవ్వబోతున్న అశోక్ గళ్ళను  గ్రాండ్ గా లంచ్  చేసేందుకు తండ్రి జయదేవ్ గల్లా నిర్ణయించారు . శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో అశోక్ గల్లా  సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇన్ని రోజులనుంచి తెరమీద కనిపించడం లేదు అనుకున్న రానా  తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం లో నవ్వులు చిందిస్తూ హుషారుగా  కనిపించడం తో ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: