కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్ పేరుతో కొందరు సినీ కో ఆర్డినేటర్లు మరియు మేనేజర్లు, కొత్తగా సినిమా అవకాశాల కోడం వచ్చే అమ్మాయిలను ఎన్నో రకాల లైంగిక ఇబ్బందులకు గురిచేసి వారిని లొంగదీసుకుంటున్నారని వర్ధమాన నటి శ్రీరెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతి పెద్ద వివాదాస్పదంగా మారిన ఆ అంశం, ఆ తరువాత చాలా సమస్యలకు దారి తీసింది. మొదట్లో తన ఆరోపణలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారు దిగి రాకపోవడంతో ఆమె అనంతరం అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది.  కాగా ఆ విషయమై అప్పట్లో నానా రచ్చ జరిగింది. కొన్నాళ్ళకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారు దిగివచ్చి ఆడవారికోసం ప్రత్యేకంగా మహిళా వింగ్ పేరిట టీమ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై కొందరు హీరోయిన్లు ఆరోపణలు చేస్తూ ఉండడం గమనార్హం. 

ఇకపొతే ఆ మొత్తం ఘటనతో ఎంతో పాపులర్ అయిన శ్రీరెడ్డి, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంతటితో ఆగకుండా తనను లైంగికంగా ఇబ్బందులు పెట్టారని మకొందరు టాలీవుడ్ సినిమా ప్రముఖుల పేర్లు కూడా బయట పెట్టింది. ఇక ఇటీవల పూర్తిగా చెన్నైకి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి, అప్పుడప్పుడు మధ్యలో తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొందరు నటులపై సెటైర్లు వేస్తూనే ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె 'క్లైమాక్స్' పేరుతో ఒక సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. నూతన దర్శకుడు భవాని శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరియు పృద్వి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆ మూవీ షూటింగ్ కి సంబందించిన స్టిల్స్ నేడు సోషల్ మీడియాలో విడుదల అయి తెగ వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ తెల్లని గడ్డం జుట్టుతో, పృథ్వీ స్వామీజీ గెటప్ లో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. 

డాన్స్ మాస్టర్ శివశంకర్ మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీరెడ్డి ఒక వివాదాస్పద హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం అని చెప్పాలి. ప్రస్తుతం ఫైనల్ స్టేజెస్ లో ఉన్న ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కానుందని సమాచారం. దర్శకుడు భవాని శంకర్ దీనిని క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుండగా రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాజేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీరెడ్డి వెండితెరపై తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తోందని, అలానే ఈ సినిమా తప్పకుండా తనకు మంచి బ్రేక్ ని ఇస్తుందని భావిస్తోందట. మరి నటిగా ఆమె ఆశలను ఈ సినిమా ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: