ఇటీవ‌ల వ‌చ్చిన సైరాలో స్వాతంత్ర సమరయోధుడిగా వెండితెరపై అద్భుత నటనను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే తన 152వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి వ‌ర్క్‌ను ద‌ర్శ‌కుడు కొర‌టాల స్టార్ట్ చేసేశాడు. కొద్ది రోజులుగా ఈ సినిమాలో చిరు నక్సలైట్‌ పాత్ర పోషిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ ప్ర‌చారం ఊహాగానమేనని వెల్లడైంది.


కొరటాల మూవీలో మెగాస్టార్‌ లెక్చరర్‌ పాత్రలో అభిమానులను ఆకట్టుకుంటారని తెలుస్తోంది. ఇక సైరా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రు.250 కోట్ల వ‌సూళ్ల‌తో చిరు కెరీర్‌లోనే టాప్ వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. చిరు రీ ఎంట్రీ ఇచ్చాక అటు ఖైదీ నెంబ‌ర్ 150తో పాటు ఇటు సైరా రెండు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మ‌రి కొర‌టాల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కే ఈ మూడో సినిమాపై సైతం భారీ అంచ‌నాలు ఉన్నాయి.


అటు కొర‌టాల కూడా వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. కొరటాల తమ హీరోను కొరటాల ఎలా ప్రజెంట్‌ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో చాలా స్లిమ్‌గా క‌నిపించేందుకు చిరు జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తోన్న స్టిల్స్ సైతం చాలా ఆస‌క్తిని రేపుతున్నాయి. కొరటాల మూవీలో మెగాస్టార్‌ 30 సంవత్సరాల యువకుడిగా, పెద్ద వయసు వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు.


చిరు యంగ్ వ‌య‌స్సులో ఉన్న‌ప్ప‌టి పాత్ర‌ను కొర‌టాల కోరిక మేర‌కే ఆయ‌న కుమారుడు రామ్‌చరణ్ పోషిస్తున్నాడ‌ట‌. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గోవింద్‌ ఆచార్య, గోవింద హరి గోవింద టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోంది. ఇక ఇటు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: