సంక్రాంతి ఎపుడూ పోటాపోటీయే. గతంలో అయితే సంక్రాంతి  పండుగ సందర్భంగా పదివరకూ సినిమాలు వరసపెట్టి  విడుదల అయ్యేవి.  ఇంకా చెప్పాలంటే కొత్త ఏడాది మొదటి రోజు నుంచి సినిమాలు అలా రిలీజ్ అవుతూనే ఉండేవి. అప్పట్లో సినిమాయే ఏకైక సాధనం కాబట్టి రిలీజైన అన్ని సినిమాల  హాళ్ళు నిండిపోయేవి. కాసులు కూడా బాగా  కురిసేవి. పైగా సినిమా నిర్మాణపు ఖర్చులు కూడా ఆ రోజుల్లో చాలా తక్కువ. అదే ఇపుడు అన్నీ కూడా  భారీ బడ్జెట్ సినిమాలు. ఆడితే సంక్రాంతి నాలుగు రోజులే సినిమా ఆడాలి. లేకపోతే భారీ నష్టాలే చవిచూడాల్సివస్తోంది.


ఈ నేపధ్యలో సోలోగా రావడానికి మొదట చూసుకుంటున్నారు.  అది కుదరకపోతేనే  రాజీకి వస్తున్నారు. ఇక 2020 సంక్రాంతి  రిలీజ్ కి మూడు నెలల ముందు నుంచే భోగీ మంటలు పెట్టేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. వారిద్దరూ ఒకే రోజు తమ సినిమా డేట్ ని ఫిక్స్ చేసి మరీ అనౌన్స్ చేశారు. దాంతో మొదటే    వచ్చింది అసలైన తంటా. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, బన్నీ మూవీ అల వైకుంఠపురంలో మూవీ జనవరి 12న ఒకే రోజు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కోట్లతో తీసినవే. తేడా వస్తే డిజాస్టర్లు గా మిగిలిపోతాయి. దాంతో ఈ రెండు సినిమాల మధ్యన డేట్ల పేచీ తీర్చేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగారని టాక్. ఆ విధంగా కనీసం ఒక రోజు వ్యవధిలోనైనా సినిమాలు రిలీజ్ చెసుకోమని సలహా ఇస్తన్నారు.


టాలీవుడ్ నుంచి ప్రస్తుతం అందుతున్న‌ సమాచారం బట్టి చూస్తే బన్నీ సినిమా అల వైకుంఠపురంలో జనవరి 12నే రిలీజ్ చేస్తారని అంటున్నారు. అదే మరో సినిమా సరిలేరు నీకెవ్వరు మాత్రం ముందుకో వెనక్కో జరుగుతుందని అంటున్నారు. ఈ మూవీ మాత్రం జనవరి 11 న కానీ 13కి కానీ మారుతుందని అంటున్నారు. మొత్తానికి బన్నీ మహేష్ పోటీలో మహేష్ ఒక అడుగు వెనక్కి తగ్గాడని వినిపిస్తోంది. మరి సినిమాల్లో ఏది పెద్ద హిట్ అవుతుంది. ఎవరు ముందు నిలుస్తారన్నది ఆడియన్స్ నిర్ణయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: