సంచలన దర్శకుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ సినిమాలో ఎక్కువగా వైసీపీ పార్టీకి రాంగోపాల్ వర్మ ఫేవర్ గా ఉంటూ సినిమా తెరకెక్కించడం తో చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మరియు కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మ పై ఆయన వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. గతంలో సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా తీసి తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బతీయాలని చూశారని కావాలని రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ సినిమా పేరిట పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని రాంగోపాల్ వర్మ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మండిపడుతున్నారు.


ముఖ్యంగా ప్రస్తుతం తెరకెక్కించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తూ చిత్రీకరించిన విధానాన్ని విడుదల చేసిన ట్రైలర్ ని చూసి చాలామంది సినిమా ప్రేక్షకులు నవ్వుతుంటే మరోపక్క టిడిపి నాయకులు ఆర్జివి పై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం కూడా ఓ పాత్ర చేశారు. అయితే బ్రహ్మానందం చేసిన పాత్ర అతనిదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


విషయంలోకి వెళితే ఇటీవల రామ్ గోపాల్ వర్మ సినిమాలో బ్రహ్మానందం ఉన్న సీన్ కు సంభదించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ ఫొటో చూసిన వారంతా బ్రహ్మానందం కేరక్టర్ ఓ పత్రికా, మరియు చానెల్ అధిపతిది అనే నిర్ణయానికి వచ్చేసారు. అదే సమయంలో బ్రహ్మీ పాత్ర ఓ ప్రముఖ వ్యాపార వేత్త కమ్ పొలిటీషియన్ అనే కూడా వినపడుతోంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా లో బ్రహ్మానందం క్యారెక్టర్ కి సంబంధించి రకరకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: