దక్షిణాది సినిమా రంగంలో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది పూనమ్ కౌర్. గతంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన పూనం కౌర్ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పక్కకు తప్పుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విషయాలలో పరోక్షంగా కామెంట్ చేస్తూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తూ కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ పెడుతున్న పోస్టులు బట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని ఆయన అభిమానులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉండగా పూనమ్ కౌర్ తాజాగా అయోధ్య అంశం గురించి పరోక్ష వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది.


అయోధ్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకే కేటాయిస్తూ సుప్రీం కోర్టు శనివారం రోజు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 'నాకు ఈ విషయం గురించి ఆశ్చర్యంగా ఉంది.. హర్ట్ అయ్యాను కూడా. గత 70 ఏళ్లలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. ఈ నిర్ణయం పట్ల కనీసం కృతజ్ఞత తెలుపకుండా కొంతమంది సైలెంట్ గా ఉండిపోయారు.


ఇలాంటి వారంతా స్వార్థం కోసం, పబ్లిసిటీ కోసం, ఓట్ల కోసం మాత్రమే మాట్లాడుతారు అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది'. దీంతో హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్ట్ ని ఎత్తిచూపుతూ మనుషుల భావోద్వేగాలకు మతాలకు సంబంధించిన విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భారతదేశంలో అని కొంతమంది సైలెంట్ గా పూనమ్ కౌర్ కి సెటైర్లు వేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: