దాదాపుగా 134 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా వివాదాస్పదంగా మారిన అయోధ్య వివాదం ఎట్టకేలకు నవంబర్ 9 వ తేదీతో ముగిసింది.  నవంబర్ 9 వ తేదీన సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.  ఈ తీర్పు ప్రకారం వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్ కు ఇవ్వాలని ఆదేశించింది.  అయోధ్యకు ఈ స్థలాన్ని కేటాయించి, బాబ్రీ మసీద్ కోసం ఐదెకరాల స్థలాన్ని అయోధ్యలోని మరో ప్రాంతంలో ఇవ్వాలని చెప్పింది.  


ఈ తీర్పును దేశంలోని ప్రతి ఒక్కరు స్వాగతించారు.  అప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా బాబ్రీ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. అంగీకారం తెలిపారు.  సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామని ముస్లిం సోదరులు కూడా చెప్పడం విశేషం.  ఈ తీర్పు తరువాత దేశంలో మార్పులు రాబోతున్నాయి.  తీర్పును అనుసరించి ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగబోతున్నది.  


ఇక ఇదిలా ఉంటె, అయోధ్య తీర్పుపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ స్పందించారు.  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు.  అయోధ్యలో ముస్లింల కోసం ఇచ్చిన ఐదు ఎకరాల భూమిలో మసీద్ కు బదులుగా స్కూల్, కాలేజీలు నిర్మించాలని, ముస్లిం పిల్లలకు ఇప్పుడు విద్య అవసరం అని అయన అన్నారు.  విద్య లేకుంటే వెనకబడి పోతారని, దేశంలో 22 కోట్లమంది ముస్లింలకు విద్య సరిగా అందటం లేదని, విద్య ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం అని అన్నారు.  


సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, మరలా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, దానిపై ఇప్పుడు చర్చలు పెట్టి సమయం వృధా చేసుకోవద్దని  అన్నారు.  ప్రధాని నరేంద్రమోడీ శాంతి కోసం పాటుపడుతున్నారని, దేశంలో శాంతి మార్గం ఎంతో అవసరం అని సలీం ఖాన్ పేర్కొన్నారు.  ఒక్క సలీం ఖాన్ మాత్రమే కాదు.. దేశంలో సెలెబ్రిటీలు చాలామంది ఇలానే చెప్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: