టాప్ హీరోల కుటుంబాల నుంచి వారసులుగా కొత్త హీరోలు రావడం టాలీవుడ్లో కామనే . ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు టాలీవుడ్ కి ఏంట్రీ ఇచ్చి  తమ హవా నడిపిస్తున్నారు.ఇక  నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది హీరోలు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాళ్ళలో ప్రస్తుతం రాణిస్తుంది  మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు మాత్రమే . ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కూడా సుధీర్ బాబు హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.ఇక  ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ కి  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహేష్ బాబు బావ టీడీపీ ఎంపీ  గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా... టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాగా నేడు ఈ సినిమాని క్లాప్ కొట్టి రామ్ చరణ్ ప్రారంభించారు. అయితే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు  అశోక్ గల్లా  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్  ఫుల్ సినిమా ద్వారా టాలీవుడ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 



 ఈ చిత్రం నేడు రామానాయుడు  స్టూడియోస్ ఘనంగా  ప్రారంభించారు.అయితే ఈ సందర్భంగా మాట్లాడిన గల్లా  జయదేవ్... తన కుమారుడు అశోక్ గల్లా  టాలీవుడ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు అని తెలిపారు. తన సొంత బ్యానర్ అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని  గల్లా జయదేవ్ తెలిపారు. తమ సొంత బ్యానర్ అయినా  అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ సంస్థను కొన్నేళ్ల కిందటే రిజిష్టర్ చేసామని చెప్పిన గల్లా జయదేవ్... సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాలను  కూడా రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తన కుమారుడు అశోక్ గల్లా  గురించి మాట్లాడుతూ... అశోక్ గల్లా కు  ఇది తొలి చిత్రం ఏమీ కాదని... ఇంతకుముందు కృష్ణ మహేష్ బాబు సినిమాల్లో అశోక్ గల్లా  నటించాడని  వెల్లడించారు గల్లా జయదేవ్ . ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నాడు అని అశోక్ గల్లా కి  కెమెరా కొత్తేమీ కాదని పేర్కొన్నారు. 



 అయితే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే హీరోగా ఏంట్రీ   ఇచ్చిన సుధీర్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ బాబు . ఒక నటుడిగానే కాదు డాన్సుల్లో కూడా ఇరగదీస్తున్న సుధీర్ బాబు...  తనదైన సత్తా చాటుకుంటున్నారు. కాగా  ఇప్పుడు మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి మరో కొత్త హీరో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం అవ్వగా... హీరో గా ఎంట్రీ ఇస్తున్న గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా  టాలీవుడ్ లో ఎలా రాణిస్తాడో  చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: