స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పెళ్ళి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆలోచించి సినిమాలను ఒప్పుకుంటుంది. ఈ ఏడాది సమంత నటించిన సినిమాలు చూస్తేనే ఆ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది.  తెలుగులో 'మజిలీ'.. 'ఓ బేబీ' సినిమాల్లో నటించి రెండు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తమిళంలో నటించిన 'సూపర్ డీలక్స్' కూడా మంచి హిట్టే అందుకుంది. సూపర్ డీలక్స్ లో సమంత పాత్ర రోటీన్ కానే కాదు.. డిఫ్రెంట్ గా అనిపించే బోల్డ్ పాత్ర. సమంత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యే పాత్ర అయినప్పటికి అందరిని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా సమంత అక్కినేని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. సమంత ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో సామ్ వర్క్ పూర్తయిందట.  దీంతో సామ్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం కథలు వింటోందట. అయితే తన వద్ద కు వచ్చే దర్శక, రచయితలకు రొటీన్ గా.. రెగ్యులర్ గా ఉండే పాత్రలు వద్ద ని చెప్తోందట. మజిలీ తరహాలో బలమైన పాత్రలు అయితేనే ఆసక్తి చూపిస్తోందట. అంతేకాదు బోల్డ్ గా ఉన్నా ఫరవా లేదని.. అందులో కూడా రెగ్యులర్ గా కాకుండా కొత్తదనం తప్పకుండా ఉండాలని గట్టిగా చెప్తోందట. అందుకే సమంత నటించే కొత్త సినిమాలు ఇంకా ఫైనల్ కాలేదని తాజా సమాచారం. త్వరలోనే సమంత ఫ్యూచర్ ప్రాజెక్టుల పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమంత సన్నిహితులు చెబుతున్నారు.

ఇక సమంత.. శర్వానంద్ నటిస్తున్న '96' రీమేక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ డిసెంబర్.. జనవరి సీజన్ అంతా ఫుల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి  వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు సమంత కొత్త సినిమాల ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బోల్డ్ క్యారెక్టర్స్ అయినా ఒకే అని సమంత చెప్పడంతో 'వేదం' లో అనుష్క పోషించినటువంటి పాత్రలు సిద్దం చేసే పనిలో రచయితలు ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: