మెగాస్టార్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. మన చిరంజీవి అనుకున్నారు కదా.. కాదు. మన చిరు కాదు. మలయాళం ఇండస్ట్రీ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ మమ్ముట్టి కొత్త సినిమా లుక్ ఈరోజు విడుదల చేశారు. సంతోష్ విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మమ్ముట్టి సినిమా విడుదలకు సిద్దమవుతుంది. 

                    

ఈ నేపథ్యంలోనే మమ్ముటి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా పేరు వన్ గా నిర్ణయించారు. ఇప్పటికే మలయాళంలో వరుసగా సినిమాలు తీస్తున్న మమ్ముట్టి ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ వన్ చిత్రాన్ని శ్రీలక్ష్మి నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

               

కాగా మమ్ముట్టి ఇప్పటికే దాదాపు 400 సినిమాలలో నటించారు. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లోని ప్రస్తుతం  నటిస్తున్నారు. ఇటీవలే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో నటించి కాదు కాదు జీవించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 

                 

కాగా తాజాగానే మమ్ముట్టి విభిన్నమైన కథాంశంతో మామాంగం అనే చిత్రంలో నటించారు. మామాంగం అనే టైటిల్ తో మలయాళంలో రూపొందిన ఈ సినిమా, అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను ఈ నెల 21వ తేదీన పలకరించనుంది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా నిన్ననే రిలీజ్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: