టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు రూటు మార్చారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు హీరోలు ప్రొడక్షన్ హౌస్ లు ఏర్పాటు చేసుకొని వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తూ ఉండగా మరికొందరు హీరోలు మాత్రం తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. గత రెండు రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీయార్ సొంత ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. 2020 సంవత్సరం జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 
 
రామ్ చరణ్ కు జోడీగా ఈ సినిమాలో అలియా భట్ నటిస్తుండగా జూనియర్ ఎన్టీయార్ హీరోయిన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తరువాత జూనియర్ తన సొంత ప్రొడక్షన్ పై ఒక సినిమా గురించి ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. స్టార్ హీరో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీయార్ కు సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంటే మంచిదని సూచించినట్లు జూనియర్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేసినట్లు సమాచారం. 
 
జూనియర్ ఎన్టీయార్ తన సన్నిహితుల దగ్గర సొంత ప్రొడక్షన్ హౌస్  తన తండ్రి మరియు కుమారుడి పేర్లు కలిసి వచ్చే విధంగా ఉంటే మంచిదని చెప్పినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీయార్ సొంత ప్రొడక్షన్ హౌస్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఈ వార్తల గురించి స్పందించాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: