టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు రూటు మార్చారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు హీరోలు ప్రొడక్షన్
హౌస్ లు ఏర్పాటు చేసుకొని వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తూ ఉండగా మరికొందరు హీరోలు మాత్రం తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. గత రెండు రోజులుగా
టాలీవుడ్ ఇండస్ట్రీలో
జూనియర్ ఎన్టీయార్ సొంత ప్రొడక్షన్
హౌస్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీయార్ తన సన్నిహితుల దగ్గర సొంత ప్రొడక్షన్ హౌస్ తన తండ్రి మరియు కుమారుడి పేర్లు కలిసి వచ్చే విధంగా ఉంటే మంచిదని చెప్పినట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీయార్ సొంత ప్రొడక్షన్
హౌస్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఈ వార్తల గురించి స్పందించాల్సి ఉంది.