గత సంవత్సరం టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన నటి శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..ఎంతో మంది అమాయకమైన యువతులను హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను చేస్తామని ఎంతో మంది దళారులు దారుణమైన మోసాలు చేస్తున్నారని..అందులో చాలా మంది సినిమా వాళ్లే ఈ మోసాలకు పాల్పపడుతున్నారని ఆమె ఆరోపించింది.   కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున్న ఉద్యమం కూాడా తీసుకు వచ్చింది.  ఆమె ఉద్యమానికి చాలా మంది సంఘీభావం తెలిపారు.


కానీ అనూహ్యంగా   శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని అనరాని మాటలు అనడంతో ఒక్కసారే ఆమెపై వ్యతిరేకత వెల్లువెత్తింది.  ఉన్న సపోర్ట్ పోవడమే కాదు..ఆమెపై ట్రోలింగ్స్ విపరీతంగా రావడంతో కొంత కాలం మీడియాకు దూరంగా ఉంది. తర్వాత ఆమె చెన్నై వెళ్లిపోయారు...అక్కడే స్థిరపడ్డారు. తాజాగా శ్రీరెడ్డికి 'క్లైమాక్స్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో ఒక అవకాశం దక్కింది. తెలుగు రాజకీయాలపై ఒక సెటైర్ లాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీరెడ్డి ఒక వివాదాస్పద నటి పాత్రలో నటిస్తోందని సమాచారం. 


ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్.. పృథ్విరాజ్.. శివశంకర్ మాస్టర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ మద్య క్లైమాక్స్ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా రాజేంద్రప్రసాద్, ఫృథ్వి తో పాటు శ్రీరెడ్డి ఫోటో రిలీజ్ చేశారు.  ఇందులో చాలా హాట్ హాట్ గా దర్శనమిచ్చింది శ్రీరెడ్డి. రాజేంద్ర ప్రసాద్ పొడవాటి గడ్డం పెంచి మోడరన్ గెటప్ లో ఉన్నారు. మరి ఈ సినిమాతో అయినా శ్రీరెడ్డికి టాలీవుడ్ లో మంచి బ్రేక్ దక్కుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా శ్రీరెడ్డి నటిగా తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకునేందుకు ఇదో చక్కని అవకాశం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: