త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంబులో’ సినిమా షూటింగ్ ప్యారిస్ లో జరుగుతుంది. సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణలో ముఖ్యంగా సామజవరగమన పాటకి మంచి ఆదరణ సోషల్ మీడియాలో దక్కడంతో సినిమాకి మంచి క్రేజ్ హైపు రావటంతో ఈ సాంగ్ కి సంబంధించిన లొకేషన్ విషయంలో ఎక్కడా కూడా నిర్మాత రాజీపడకుండా ఖర్చు పెడుతుంటే మరోపక్క ఈ సాంగులో అదిరిపోయే స్టెప్పులు తో మరియు ఎక్స్ప్రెషన్స్ తో అల్లు అర్జున్ స్టెప్పులు వేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే లు కలసి చేస్తున్న ఈ సాంగ్ లో ప్యారిస్ దేశంలో ఫేమస్ డాన్స్ గా పేరొందిన లిండో డ్యాన్స్ స్టెప్పులు మరియు లిండో డ్యాన్సర్లతో  అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే స్టెప్పులు వేసినట్లు సమాచారం.


దీంతో ఈ సాంగ్ షూటింగ్ చాలా అద్భుతంగా వచ్చిందని సినిమా యూనిట్ కి చెందిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ప్యారిస్ దేశమంటే సెంటిమెంట్ అని...చాలా వరకు త్రివిక్రమ్ దర్శకత్వం చేసిన సినిమాల షూటింగ్ అవుట్ డోర్ విషయంలో..త్రివిక్రమ్ మొదటిగా ప్యారిస్ దేశాన్ని ఎక్కువగా ఇష్టపడతారని...ఈ దేశంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా షూటింగ్ జరిగిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని దీంతో 'అలా వైకుంఠపురం లో' కూడా గ్యారెంటీగా హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది అంటూ ఇండస్ట్రీలో కొంతమంది త్రివిక్రమ్ సెంటిమెంట్ పై కామెంట్ చేస్తున్నారు.


మరోపక్క సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకూడదని అల్లు అర్జున్ ఫుల్ గా డిసైడ్ అయినట్లు ఈ సినిమాతో ఎలాగైనా త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని సక్సెస్ ట్రాక్ ఎక్కాలని బన్నీ భావిస్తున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: