టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో నాని తరువాత ఆ స్థాయి మార్కెట్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. గీతా గోవిందం సినిమా ఫుల్ రన్లో 65 కోట్ల రూపాయల షేర్ సాధించింది. విజయ్ గత చిత్రం డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయినప్పటికీ విజయ్ మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ కు జోడీగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ సినిమాకు రిలీజ్ డేట్ సమస్యగా మారింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ఈ సినిమా నిర్మాతలు భావించారు. 
 
కానీ డిసెంబర్ నెలలో ఈ సినిమాకు సరైన డేట్ దొరకటం లేదని తెలుస్తోంది. జనవరి నెలలో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉండటంతో జనవరిలో కూడా ఈ సినిమా విడుదల కావటం సందేహమే అని తెలుస్తోంది.  వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డే రోజున విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఫిబ్రవరి వరకు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయవద్దనే అభిప్రాయం విజయ్ అభిమానుల నుండి వ్యక్తమవుతోంది. 
 
సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలలలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఆ సమయంలో విడుదలైన సినిమాలకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందువలన విజయ్ దేవరకొండ అభిమానులు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: