గతంలో మారుతి ఈ రోజుల్లో, బస్ స్టాప్ అని యూత్ సినిమాలో కాస్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రొమాంటిక్ గా తీస్తేనే పెద్ద నేరం చేసినట్టుగా మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడొస్తున్న పచ్చి, పరమ బూతు సినిమాల గురించి ఏమనాలో. మా సినిమా అద్భుతమని ప్రతి ఒక్కడు చెప్పేవాడే. కానీ.. అందుకు భిన్నంగా మా సినిమా పక్కా అడల్ట్ సినిమా. పచ్చి బూతు సినిమా. సెన్సార్ చేసినోళ్లు సిగ్గు పడిపోయారంటూ బోల్డ్ గా పచ్చి నిజాన్ని చెప్పి మరీ విడుదల చేసిన సినిమా 'ఏడు చేపల కథ'. టైటిల్ లో కథ ఉంది కదా? అన్న డౌట్ అక్కర్లేదని.. తమ సినిమాలో కథ అస్సలు ఉండదని.. యూత్ కావాల్సిన కంటెంట్ మాత్రమే పచ్చిగా ఉందని ఓపెన్ గా చెప్పేశారు.

దీనికి తగ్గట్లే పోస్టర్లతో హీట్ పెంచేసి.. టీజర్.. ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేయటంలో సక్సెస్ అయ్యారు దర్శక నిర్మాతలు. గతంలో తాము మంచి సినిమా చేసి నాశనమయ్యామని.. అందుకే ఈసారి పక్కా బూతు సినిమా చేయాలని డిసైడ్ అయ్యామంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓపెన్ గానే మాట్లాడేసింది ఈ చిత్ర యూనిట్. ఇంత చెప్పిన తర్వాత ఈ తరహా కంటెంట్ ను ఇష్టపడే వాళ్ళు కుదురుగా ఉంటారా. మీరింత ఓపెన్ అయ్యాక.. మేం మాత్రం ఓపెన్ కాకుంటే ఏం బాగుంటుంది భయ్యా అని అనుకున్నారేమో కానీ.. భారీ ఎత్తున స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తోంది. చలికాలంలో వేడి కోసం వెళుతున్నట్టుగా జనాలు ఏడు చేపలున్న దగ్గరికి వెళ్ళి చలి కాచుకుంటున్నారు.

సినిమా విడుదలైన తొలి రోజున రూ.1.9  కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. రెండో రోజు పుంజుకొని రూ2.4 కోట్ల గ్రాస్ ను సాధించి బ్రేక్ ఈవెన్ కొట్టేసిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏమీ దాచుకోకుండా తమ సినిమా గురించి నిజాలు చెప్పేసిన దర్శక నిర్మాతలు రెండో రోజు కలెక్షన్లతో సేఫ్ జోన్లోకి వచ్చేశారట. ఈ ఆదివారం కలెక్షన్ల జోరు అదే స్థాయిలో కొనసాగితే.. పండుగే అంటున్నారు. ఏమైనా.. బూతును ఇంత ఓపెన్ గా ప్రమోట్ చేసి కమర్షియల్ హిట్ కొట్టిన వీరి ధైర్యం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొంతమందైతే కమర్షియల్ సినిమాలు ఇక అనవసరం ఎంచక్కా ఓ బూతు సినిమా తీసేస్తే సెటిలైపోవచ్చని అనుకుంటున్నారట. మరి ఈ దరిద్రం ఇండస్ట్రీలో ఇంకెన్నాళ్ళు చూడాలో. 


మరింత సమాచారం తెలుసుకోండి: