బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ విషయంపై ఒక్కోరోజు ఒక్కోలా వార్తలు వస్తున్నాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే అనుకున్న విధంగా షూటింగ్ జరగడం కష్టమే కాని అక్కడ ఉన్నది రాజమౌళి కాబట్టి అంతా సవ్యంగానే సాగుతుందట.


అయితే సినిమా షూటింగ్ మొదలుపెట్టిన టైం లోనే తారక్, చరణ్ లకు గాయాలవడం వల్ల సినిమా షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అందుకే 2020 జూలై 30 రిలీజ్ అనుకున్న ఆర్.ఆర్.ఆర్ కచ్చితంగా రిలీజ్ వాయిదా పడుతుందని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2020 దసరా లేదా 2021 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.


సినిమాలో కొమరం భీం గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి అలియా భట్, అజయ్ దేవగన్ కూడా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 400 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు.


అయితే నిజంగానే ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడుతుందా రాజమౌళి రిలీజ్ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమాసినిమా రికార్డులను తిరగరాసేలా తెరకెక్కిస్తున్నాడట. మరి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత సరికొత్త సంచలనాలు ఏర్పడుతాయని చెప్పొచ్చు.  కచ్చితంగా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత సరికొత్త సంచలనాలు ఏర్పడుతాయని చెప్పొచ్చు. అసలైతే జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయించాలని అనుకున్నాడు రాజమౌళి కాని సినిమా షూటింగే ఏర్పిల్, మే వరకు పట్టేలా ఉందట. అందుకే సినిమా రిలీజ్ వాయిదా పడటం పక్కా అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: