కొంతమందికి లక్కు అలా కలసి వస్తుంది. ముఖ్యంగా తెలుగు సినీ సీమలో అలాంటి  చిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. వారి జాతకం అది. కెరీర్ అయిపోయిందని అంతా అనుకుంటున్న వేళ ఇంటి తలుపు తట్టి మరీ చేతిలో ఆఫర్లు పెడుతున్నారు. ఇది  ఎంతమందికి దొరుకుతుంది. పెట్టి పుట్టిన వారికే ఇది సాధ్యం. ఆ విధంగా ఒకే సమయంలో కొంతమంది సీనియర్లు ఇలా లక్కుని తొక్కి కులసాగా ధిలాసాగా  నవ్వుతున్నారు.


వారిలో చెప్పుకుంటే శ్రియ, త్రిష మొదటిగా  కనిపిస్తారు. శ్రియ కెరీర్ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఈ మధ్య పెద్దగా సిల్వర్ స్ర్కీన్ మీద  కనిపించడంలేదు కూడా. శ్రియ  పెళ్ళి చేసుకుని సెటిల్ అయిందని అంతా భావిస్తున్న సమయంలో వెంకటేష్ ప్రెస్టేజియస్ మూవీ అసురన్ లో ఆమెను హీరోయిన్ గా  సెలెక్ట్ చేశారు. పిలిచి మరీ పెద్ద పీట వేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్లో నిర్మాణం అవుతున్నా ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. హిట్ అయిందా శ్రియ జాతకం తిరగడం ఖాయం.


ఇక మరో హీరోయిన్ త్రిష. ఈ అమ్మడు కెరీర్ కూడా క్లోజ్ అనేశారు. అయితే కొరటాల, చిరంజీవి కాంబినేషలో మూవీ కోసం ఒక హీరోయిన్ గా త్రిషను తీసుకుంటున్నారని అంటున్నారు. త్రిష ఎపుడో 2005లో చిరంజీవితో స్టాలిన్ మూవీ నటించింది. ఆమెకు చాన్స్ రావడం అంటే పంట పండినట్లేనని అంటున్నారు.


ఇక సీనియర్ హీరోలకు సరిజోడు లేక సీనియర్ హీరోయిన్ల డోర్లు తడుతున్నారని అంటున్నారు. బాలక్రిష్ణ కూడా ఎపుడో  తెరవెనక్కు వెళ్ళిపోయిన వేదికను హీరోయిన్ గా పెట్టుకుని రూలర్ సినిమా తీస్తున్నారు. అదే విధంగా నాగార్జున మూవీస్ లో రమ్యక్రిష్ణ జంట కట్టి తాను నాటౌట్ అంటోంది. అదే విధంగా మరో సీనియర్ హీరోయిన్  తమన్నాకు కూడా అవకాశాలు వరసగా వస్తున్నాయి.  ఇలా చెప్పుకుంటూ పోతే సిక్స్ టీ  ప్లస్ లో ఉన్న హీరోలు యాక్టివ్ గా  ఉన్నంత వరకూ సీనియర్ హీరోయిన్ల కెరీర్ క్లోజ్ అవదని అంటున్నారు. వారిని పెట్టుకునే తమ సినిమాలు తీయాల్సి వస్తోందని అంటున్నారు. సో తెలుగు చిత్ర సీమ విచిత్ర సీమ అనకతప్పదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: