టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అంటే గుర్తొచ్చేపేరు అల్లుఅర్జున్.. అందరు ముద్దుగా ఈయనను బన్నీ పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే,  ప్రస్తుతం నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో సినిమాలోని పాటను తాజాగా ప్యారిస్ లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ల, పూజ హెగ్డే ల మధ్య చిత్రీకరిస్తున్న ఈ పాటలో లిండో డ్యాన్సర్లు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు.ఇక్కడ  లిండో అనేది చాలా ప్రత్యేకమైనది. గత మూడు దశాబ్దాలుగా లిండో  డ్యాన్స్ వేస్తూ అలరిస్తూ వస్తున్నా డ్యాన్సర్లు సామజవరాగమన సాంగులో కనిపించబోతున్నారట. 


కాగా, తెలుగు చిత్రాలు చాలానే ఫ్యారిస్ లో తెరకెక్కాయి. ఏ ఒక్క సినిమాలో కూడా ఫ్యారిస్ సాంప్రదాయ నృత్యం కానీ, డ్యాన్సర్స్ కానీ కనపడలేదు.వివరాల్లోకి వెళితే..  అలా వారిని ప్రత్యేకంగా చూపించిన ఘనత కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే దక్కుతున్నమాట. సిరివెన్నెల సీత రామశాస్త్రి రచించిన  సామజవరాగమన లిరికల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిన విషయమే. 


ఆ సాంగ్ ప్రత్యేకతను అలాగే  కొనసాగించాలనే ఉద్ద్యేశ్యంతో ఈ పాటను లిండో డ్యాన్సర్లు తో చిత్రీకరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్నా మూడో సినిమా కావడంతో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అయిన జనవరి 11 న ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి మేకర్స్ కూడా పోటీపడుతున్నారు.సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..  


త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా మూడోది...  మొదట వచ్చిన సినిమాలు జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అయ్యాయి. మూడో సినిమాగా వస్తున్నా ఈ సినిమా కూడ హిట్ అవుతుందనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. వచ్చే ఏడాదికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వొచ్చు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: