స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఫ్లాప్ అందుకున్న పూజా హెగ్దె.. బన్నితో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది.


తనకు హిట్ ఇచ్చిన హీరోగా అల్లు అర్జున్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది పూజా. ఇద్దరు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా క్లోజ్ గా కనిపిస్తారు. ఇదిలాఉంటే ఇప్పుడు మళ్లీ అల వైకుంఠపురములో సినిమాలో బన్నితో రొమాన్స్ చేస్తుంది పూజా హెగ్దె. సినిమాలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది.


వరుస స్టార్ సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న పూజా హెగ్దె బన్ని సినిమా విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందట. ఇక ఇష్టమైన హీరో కాబట్టి హీరోయిన్ కూడా మంచి కోపరేషన్ అందిస్తుందట. దానివల్ల హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే సామజవరగమన సాంగ్ లో అల్లు అర్జున్, పూజా హెగ్దెల జంట అదిరిపోయింది.


సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పూజా ఆమె కింద ఎంప్లోయ్ గా బన్ని కనిపిస్తాడట. ఈ ఇద్దరి హిట్ పెయిర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో టబు కూడా నటిస్తున్నారు. ఆమె కూడా సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా సినిమా సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. అల వైకుంఠపురములో 2020 సంక్రాంతి బరిలో దిగుతుంది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: