రంగస్థలం తరువాత రామ్ చరణ్ కు మంచి హిట్ లేదు.  రంగస్థలం చేసిన తరువాత ఈ హీరో బోయపాటితో వినయ విధేయ రామ సినిమా చేశాడు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  సినిమా సెంటిమెంట్ పరంగా బాగానే ఉన్నా, బోయపాటి ఊరమాస్ దెబ్బకు కుదేలయింది.  పరిమితికి మించి యాక్షన్ ను పెట్టడం మైనస్ అయ్యింది.  బోయపాటి యాక్షన్ ను తట్టుకోవాలి అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా కష్టం.  ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా చూస్తారు.  


బోయపాటి గారు ఒకసారి బాలీవుడ్ వెళ్లి అక్కడ ఇలాంటి సినిమా తీస్తే బాగుటుంది కదా ఆలోచించండి. వినయ విధేయ రామ మిగిల్చిన చేదు అనుభవం నుంచి బయటపడేందుకు రామ్ చరణ్ ప్రయత్నం చేస్తున్నాడు.  ఈ సినిమా తరువాత చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నాడు.  ఈ పాత్రతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి.  


అల్లూరిసీతారామ రాజు బయోపిక్ ను సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడో తీశాడు.  అప్పట్లో అది బ్లాక్ బస్టర్ హిట్.  ఆ తరువాత ఆ పాత్రతో ఎన్నో సినిమాలు వచ్చాయి.  అది వేరే విషయం అనుకోండి.  ఇప్పుడు రామ్ చరణ్ కు ఆ పాత్ర ఇస్తున్నారు అంటే.. తక్కువేం కాదు.  కాకపోతే, కొమరం భీం పాత్రను ఈ సినిమాలో రాజమౌళి ఎక్కువగా హైలైట్ చేస్తున్నారని, సమాచారం.  


కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. షూటింగ్ సైతం ఎక్కువగా ఎన్టీఆర్ చుట్టూనే నడుస్తున్నది. కొమరం భీం కోసం ఓ విదేశీ అమ్మాయిని రాజమౌళి సెట్ చేస్తున్నారు.  ఇక్కడ విషయం ఏమిటంటే.. ఈ రెండు పాత్రలు చారిత్రాత్మకమైన పాత్రలు.  అయితే, ఈ పాత్రల్లో కల్పితం ఎక్కువగా ఉంటుందని రాజమౌళి చెప్తున్నారు.  ఒరిజినల్ గా చూసుకుంటే, ఈ ఇద్దరు అసలు కలుసుకున్నట్టుగా చరిత్రలో లేదు. కానీ, ఇది ఫిక్షన్ కాబట్టి కావలసినట్టుగా కథను అల్లుకొని సినిమా తీస్తున్నారు.  మరి ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది జులై 30 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: