టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా అదో సంచలనంగా మారుతుంది.  ఆయన తీసే సినిమాలు ఎంత కాంట్రవర్సీలుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇటీవల ఏపిలో ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’మూవీతో పెద్ద దుమారమే రేపారు.  స్వర్గీయ ఎన్టీఆర్ దీవెనలు తనకు ఉన్నాయని..లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చిందని..ఎన్టీఆర్ నమ్ముకున్నవారు ఆయను ఎలా వెన్నుపోటు పొడిచారు అన్న కోణంలో సాగిన ఈ మూవీ ఆ మద్య ఎన్నో కాంట్రవర్సీలు తెరపైకి తీసుకు వచ్చాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్ వెన్ను పోటు అనే టాపిక్ టీడీపీ నేతల్లో మింగుడు పడలేదు. తమ నాయకుడిని కించపరిచే విధంగా ఉందని ఆ మూవీ బ్యాన్ చేయాలని పట్టపట్టారు. కోర్టు వరకు వెళ్లడంతో ఎన్నిక సమయంలో ఇబ్బంది కలుగుతుందని..ఆ మూవీని ఏపిలో రిలీజ్ ఆపివేశారు. కాకపోతే మిగతా రాష్ట్రాల్లో ఆ మూవీ రిలీజ్ అయ్యింది.  ఏపిలో ఎన్నికల్లో వైసీపీ నెగ్గింది..తర్వాత మూవీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’మూవీ తెరకెక్కిస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఈ మద్య టీజర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 

ఇందులో ప్రస్తుత రాజకీయాలపై ఫోకస్ చేశారు. అయితే మరోసారి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ బాబు ని టార్గెట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని పప్పులాంటి అబ్బాయి పాట ఇదిగో.. ఇది తండ్రీకొడుకుల ప్రేమను తెలిపే పాట. ఇందులో తొలి పార్ట్ తండ్రి కోణంలో, రెండో పార్ట్ కుమారుడి కోణంలో ఉంటుంది. ఈ పాత్రలు ఎవరినైనా పోలి ఉన్నాయని మీకనిపిస్తే ఇది కేవలం యాధృచ్ఛికం మాత్రమే' అని పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి  నిర్మాతలు: టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్, సహనిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ.  

మరింత సమాచారం తెలుసుకోండి: