రాయినైనా కదిలించే అందం తన సొంతం అంటోంది రాయ్ లక్ష్మి. ఖైదీ నంబర్ 150 మూవీలో మెగాస్టార్ చిరంజీవితో జోడీ కట్టిన రత్తాలు ఐటం బాంబ్ గా కూడా  యూత్  గుండెల్ని పేల్చేసింది. అందమంతా దాచుకుంటూనే ఎక్కడ ఏది చూపాలో తెలిసిన రాయ్ లక్ష్మి సోషల్ మీడియాకే ఫీవర్. ఆమె అంటే అందరికీ ఫావర్. రాయ్ లక్ష్మి హాట్ హాట్ పిక్స్ తో అందాలను వండి వారుస్తూనే ఆకళ్ళ ఆ కళ్ళు అన్నీ ఆశగా ఎగబడుతున్నాయి.


రాయ్ లక్ష్మి తెలుగులో శ్రీకాంత్ తో కాంచన మాలా కేబుల్ టీవీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అపుడు ఆమె పేరు లక్ష్మీ రాయి. ముద్దబంతి పువ్వులా ఆ మూవీలో కనిపించి వెండితెరకు మరో స్టార్ హీరోయిన్ వచ్చిందన్న ఆశలు కలిగించింది. అయితే ఆ తరువాత ఆమె సరైన  పాత్రలు ఎంపిక చేసుకోకపోవడంతో పాటు కరెక్ట్  ప్లానింగ్ లేకపోవడంతో మిడిల్ గ్రూప్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది.


అయితే  హీరో బాలక్రిష్ణతో అధినాయకుడు మూవీ 2011లో వచ్చింది. అయితే ఆ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రపడిపోయిన లక్ష్మీ రాయి ఇక లాభం లేదనుకుని తన పేరుని రాయ్ లక్ష్మిగా మార్చేసుకుంది. ఆ తరువాత ఆమె ఐటం బాంబ్ గా మారి చేసిన సినిమాలు ఓ వూపు ఊపేశాయి. ఇక రాయ్ లక్షి ఐటం సాంగ్స్ ఒక ఎత్తు, మెగాస్టార్ తో చేసిన రత్తాలు సాంగ్ ఒక ఎత్తు.


ఒక దెబ్బతో ఆమెకు స్టార్ డం వచ్చేసింది. బాలీవుడ్, కోలీవుడ్, కన్నడ మూవీస్ చేస్తున్న రాయ్ లక్ష్మి తెలుగులో కూడా మంచి ఐటం నంబర్ వుంటే రెడీ అంటోంది. ఇదిలా ఉండాగా రాయ్ లక్ష్మి బికీనీ అందాలతో పిచ్చెక్కిస్తూ సోషల్ మీడియా ఫ్యాన్స్ కి సోష పుట్టించేస్తోంది. లేటెస్ట్ గా రెడ్ బికినీ తో రాయ్ లక్ష్మి కొత్తందాలతో మెరిసిపోతూ కెవ్వు  కేక అనిపించేసింది. మరి సోషల్ మీడియాలో  అతి పెద్ద ఫాలోయింగ్ కలిగిన రాయ్ లక్ష్మి సక్సెస్ సీక్రెట్ బికినీ  అందాలే అని చెప్పాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: