మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ ఫిలిం లాంచింగ్ అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు అందరితో పాటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఈ మూవీ ప్రారంభోత్సవ ఫంక్షన్ కు రావడంతో ఈఫంక్షన్ అత్యంత కోలాహలంగా జరిగింది. 

రామ్ చరణ్ రానాలు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ఈఫిలిం లాచ్ కార్యక్రమం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. కేవలం నిన్న జరిగిన ఈఫిలిం లాంచింగ్ కార్యక్రమానికే 25 లక్షల ఖర్చు జరిగింది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈఫిలిం లాంచ్ కార్యక్రమం ముగిసిన తరువాత యంగ్ హీరో అశోక్ గల్లా మాట్లాడిన తీరు మీడియా వర్గాలు షాక్ అయ్యారు. 

ఒక యంగ్ హీరోల కాకుండా అనేక విషయాల పై విశ్లేషణలు చేస్తూ ముఖ్యంగా తన మేనమామ మహేష్ గురించి అశోక్ చేసిన కామెంట్స్ చాలామందికి నవ్వులు తెప్పించాయి. చిన్నతనం నుండి మహేష్ సినిమాలు చూస్తూ పెరిగిన తాను మహేష్ వీరాభిమానిని అని చెపుతూ తాను సినిమాలలోకి రావాలని ఆశపడుతున్న సమయంలో మహేష్ పెట్టిన స్వీట్ టార్చర్ బయటపెట్టాడు. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే విపరీతమైన పట్టుదల కృషి దీనికితోడు అనేక త్యాగాలు చేయాలి అని చెపుతూ అలాంటి కష్ట నష్టాలు తనకు అవసరమా అంటూ మహేష్ అనేక సార్లు తనకు చెప్పినా తాను సినిమాల వైపే మొగ్గు చూపడంతో మరొక మార్గం లేక తన అభిరుచిని మహేష్ ప్రోత్సహించిన విషయాన్నీ వివరించాడు.

అమెరికాలోని టెక్సస్ యూనివర్సిటీలో ఫిలిం మేకింగ్ లో గ్రాడ్యువేషన్ చేసి ఆతరువాత మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విషయాలను వివరించాడు. వాస్తవానికి తాను మహేష్ వీరాభిమాని అయినప్పటికీ తనను హీరో అవ్వమని ప్రోత్సహించిన వ్యక్తి తన పిన్ని మహేష్ అక్క మంజుల మాత్రమే అని చెపుతూ ఆమె ప్రోత్సాహం వల్లనే తాను హీరోను కాగలిగాను అంటూ కామెంట్స్ చేసాడు. ఈ ఫంక్షన్ ప్రాంగణంలోకి సూపర్ స్టార్ కృష్ణ రాగానే గల్లా అశోక్ తన తాత కృష్ణ వద్దకు వెళ్ళి తన తాత కృష్ణకు పాదనమస్కారం చేయడం లాంటి ఎన్నో ఆత్మీయ సన్నివేశాలతో నిన్నటి ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: