హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న చిత్రం ‘పిచ్చోడు’. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. ఇష్టపడిన అమ్మాయి ప్రేమకోసం పరితపించే ఓ కుర్రాడి కథగా పిచ్చోడు చిత్రం తెరకెక్కినట్లు సమాచారం. ఓ జంట మధ్య నడిచే సీరియల్ లవ్ స్టోరీని దర్శకుడు తెరకెక్కించారు.


 క్రాంతి, కె.సీమర్, krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ. బ్యానర్: హేమంత్ ఆర్ట్స్, కథ - స్క్రీన్ ప్లే - నిర్మాత - దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్, సంగీతం: బంటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ, ఎడిటర్: సంతోష్ గడ్డం, కెమెరామెన్: గోపి అమితాబ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గురు, మౌర్య తేజ.


గ‌తంలో ఇలాంటి క‌థ‌లు చాలానే వ‌చ్చాయి. ప్రేమక‌థ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా వ‌చ్చినా ఈ క‌థ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌ర్శ‌కుడు ఎలాంటి కొత్త‌ద‌నం చూపించ‌బోతున్నాడు అన్న‌ది తెలియాలి. ఇక‌పోతే ప్రేమ కోసం ప‌రిత‌పించే కుర్రాళ్ళ నేప‌థ్యంలో కూడా గ‌తంలో కొన్ని వ‌చ్చి విజ‌యం సాధించాయి. వాటిలో కొన్ని అప్ప‌ట్లో వ‌చ్చిన ప్రేమ‌దేశం, సుస్వాగతం లాంటి త‌ర‌హాలో ఉంట‌దా లేక ప్రేమిస్తే డ‌బ్బింగ్ మూవీ అది కూడా ఇక్క‌డ పెద్ద హిట్టే అయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: