బహుబలి సినిమాలో ప్రేక్షకుల్ని అత్యంతగా ఆకట్టుకున్న పాత్రల్లో రెండు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అందులో ప్రభాస్ చేసింది ఒకటికాగా మరోటి దగ్గుపాటి రానా చేసిన రోల్. ఇద్దరు కండలు తిరిగిన దేహాలతో, ఆకట్టుకునే రూపంతో, డైలాగ్‌లతో అదరగొట్టేసారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్‌ చేసిన బాహుబలి పాత్రకు ఎంత పేరు వచ్చిందో .. విలన్ బల్లాల దేవుడిగా చేసిన రానాకు కూడా అంతే పేరు వచ్చింది.


ఇక టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీనుంచి వచ్చిన రానా తన టాలెంట్‌తో టాలీవుడ్‌లోనే కాకుండా ఏకంగా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇకపోతే తనకున్న అనారోగ్యాల కారణంగా నటనకు కాస్త విరామం ఇచ్చి మరో కొత్త అవతారాన్ని ఎత్తబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎందరో కథానాయకులు తమలోని గాయకుడ్ని బయపెట్టారు. పంచ్‌ డైలాగులు చెప్పిన గొంతుతోనే పాటలూ పాడి ప్రేక్షకుల్ని మెప్పించారు..


ఆప్రయత్నాన్ని ఇప్పుడు రానా చేస్తున్నాడు. ఇకపోతే విశాల్‌ నటించిన  ‘యాక్షన్‌’  చిత్రం కోసం ఆయన గాయకుడుగా మారాడు. ఈ చిత్రంలో వచ్చే  ‘లైట్స్‌ యాక్షన్‌ కెమెరా’ అనే పాటను తమిళంలో వేరే గాయకులు పాడగా..  మొదటిసారిగా తెలుగు వెర్షన్‌లో రానా ఆలపించగా,  హిప్‌హాప్‌ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక ఈ విషయాన్ని రానా, హిప్‌హాప్‌, విశాల్‌ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.


ఇక హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సుందర్ సి దర్శకత్వంలో  విశాల్,  తమన్నా లీడ్‌రోల్స్‌లో,  శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా,  శ్రీకార్తికేయ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  కాగా ఈ చిత్రం నవంబర్ 15 న విడుదలవడానికి సిద్దమైంది. ఇక నటుడిగా మెప్పించిన రానా గాయకుడిగా ఏమాత్రం సకెస్స్ అవుతాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: