తమిళ హీరో సఖి సినిమా తో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్న హీరో మాధవన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ అడపాదడపా హీరోగా రాణిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మాధవన్ మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల వరుస సక్సెస్ లు అందుకుంటూ మెగా హీరోలలో ఉన్న కుర్ర హీరోలలో అద్భుతంగా రాణిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు కొంత ఫెయిల్ అయిన క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత వరుస విజయాలు సాధించారు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన 'గద్దల కొండ గణేష్' సినిమా తో అదిరిపోయే మా స్నేహితుడు తన కెరియర్ లో మొట్ట మొదటి సారి తన ఖాతాలో వేసుకున్నారు వరుణ్ తేజ్.


ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకి రెడీ అవుతున్నాడు. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పిన కథ నచ్చడంతో వరుణ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం కోసం వరుణ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో డైరెక్టర్ కిరణ్ కొరపాటి మునిగి ఉండటంతో ...తాజాగా ఈ సినిమాలో రొమాంటిక్ హీరో మాధవన్ మరియు అదే విధంగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించడానికి రెడీ అయినట్లు వరుణ్ తేజ్ తల్లిదండ్రులు గా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం. అల్లు బాబి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: