సూపర్ స్టార్ మహేష్ మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తొలిసారిగా తన సినీ కెరీర్ లో ఒక మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మహేష్ ప్రక్కన రష్మిక మందన్న జోడి కడుతుండగా సీనియర్ నటి విజయశాంతిసినిమా ద్వారా చాలా సంవత్సరాల తరువాత మళ్ళి సినిమా రంగంలోకి అడుగిడుతున్నారు. మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలసి నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు స్టైలిష్ ఫోటోగ్రాఫర్ రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. 

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ ఇంట్రో టీజర్ మరియు పలు పోస్టర్లు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా, కాసేపటి క్రితం ఈ సినిమా సెట్స్ లో హీరో మహేష్ తో కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి ఏదో డీప్ గా చర్చిస్తున్న ఫోటో ఒకటి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసారు సినిమా యూనిట్. ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోని చూస్తుంటే, తప్పకుండా వీరిద్దరి మ్యాజిక్ బాగా పనిచేసి, సరిలేరు సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

రాజేంద్ర ప్రసాద్, హరితేజ, రఘుబాబు, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సంగీత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇకపోతే దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలోని ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలో సినిమా యూనిట్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. గతంలో మహేష్, దేవి కాంబోలో వచ్చిన మహర్షి సాంగ్స్ పై మహేష్ ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేయడంతో, ఈ సినిమా సాంగ్స్ తో ఎలాగైనా సూపర్ క్రేజ్ సంపాదించాలని దేవి ఎంతో కసితో సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా అన్ని కార్యమ్రమలు పూర్తి చేసుకుని ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: