టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తండ్రి అల్లు అరవింద్ మరియు మామయ్య మెగాస్టార్ చిరంజీవి గార్ల నట వారసత్వంతో గంగోత్రి సినిమాతో అడుగుపెట్టిన హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాలో బన్నీ, తన ఆకట్టుకునే నటనతో బాగానే పేరు సంపాదించాడు. అయితే అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన డాడీ సినిమాలో ఒక చిన్న మ్యూజిక్ బిట్ కి డాన్స్ చేసిన బన్నీ, ఆ బిట్ సాంగ్ లో సూపర్బ్ రేంజ్ లో డాన్స్ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. నిజానికి అంతకముందు డాన్స్ లో మంచి ప్రావిణ్యం పొందిన బన్నీని చూసిన మెగాస్టార్, ఎంతో మెచ్చుకున్నారట. అలానే తన సినిమాలో గోపి అనే ఒక చిన్న క్యారెక్టర్ ఉందని, 

ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తావా అని అడిగారట మెగాస్టార్. ఆ విధంగా డాడీ సినిమాలోని చిన్న బిట్ సాంగ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన బన్నీ, తొలిసారిగా మాత్రం గంగోత్రితో హీరోగా పరిచయం అయ్యారు. ఇక గంగోత్రి మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కి విజయం సాధించడంతో, తన రెండవ సినిమా విషయమై బన్నీ ఎంతో కేర్ తీసుకుని తన ఫిజిక్ ని మరియు స్టైల్ ని పూర్తిగా మార్చి వేయడం జరిగింది. అలా ఆయన నటించిన రెండవ సినిమానే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య. ఫీల్ మై లవ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ సినిమాకు అప్పట్లో యూత్ ఎంతో కనెక్ట్ అయ్యారు. బన్నీ సరసన అను మెహతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. 

ఇక ఈ సినిమా సూపర్ హిట్ తరువాత బన్నీ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అక్కడినుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ తో, నేడు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరుగా ఎదిగారు బన్నీ. ఇక ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలవైకుంఠపురములో అనే సినిమాలో నటిస్తున్నారు బన్నీ. తనకు గత రెండు సినిమాల నుండి సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టాలని ఎంతో కసితో వర్క్ చేస్తున్నారట. మరి ఈ సినిమా ఆయనకు ఎంతమేర సక్సెస్ అందిస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: