నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు పొందాడు. ఆదిలో రవితేజని అనుకరిస్తున్నాడని విమర్శలు వచ్చినా తర్వాత తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. స్వామిరారా సినిమాతో నిఖిల్ కెరీర్ మారిపోయిందనే చెప్పాలి. ఆ సినిమా నిఖిల్ పుంజుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఆ సినిమా తర్వాత నిఖిల్ చాలా జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు.


అయితే సడెన్ గా అతనికి ఒక్ బ్రేక్ పడింది. అర్జున్ సురవరం సినిమా విడుదల అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడో వేసవిలో విడుదల కావాల్సిన సినిమా ఇంత వరకు రిలీజ్ జాడనే లేదు. ఏవేవో కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుండడంతో అసలు సినిమా విడుదల అవుతుందా..లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త బయటకి వచ్చింది. ఈ నెల 29 న విడుదల అవుతుందని సమాచారం.


అయితే అదే రోజు సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అతి వివాదాస్పద చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" ని విడుదల చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టిజర్, ట్రైలర్ లకి విపరీతమైన స్పందన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విధమైన ఆసక్తి నెలకొంది. సినిమాలో ఏం చూపించబోతున్నాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


దాంతో ఆ రోజు నిఖిల్ సినిమా ఓపెనింగ్స్ కి దెబ్బపడే అవకాశం ఉంది. అసలే విడుదల అవడానికి ఎక్కువ రోజులు సమయం తీసుకుందని ఆలోచిస్తే, మళ్లీ తనకి పోటీగా వర్మ దిగడంతో సినిమా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారట. మరి నిఖిల్ సినిమా అదే రోజు విడుదల అవుతుందా.. లేదా మళ్లీ వాయిదా వేస్తారా అనేది తెలియాలి. ఒకవేళ అదేరోజు రిలీజ్ అయితే వర్మ సినిమా దెబ్బకి నిఖిల్ నిలబడటం కష్టమే అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: