దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో ఒక చారిత్రాత్మక సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని  అందుకున్నారు . సైరా నరసింహ రెడ్డి మేకింగ్  అద్భుతంగా ఉంది అంటూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు సురేందర్రెడ్డి. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన చిత్రాలను  సమర్థవంతంగా తెరకెక్కించగలను అంటూ  నిరూపించుకున్నాడు సురేందర్ రెడ్డి . అయితే సైరా విజయంతో  సురేందర్ రెడ్డికి మంచి క్రేజ్ ఏర్పడింది. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత దర్శకుడు సురేందర్రెడ్డి ఏ  చిత్రం చేస్తున్నారు అనేదానిపై  ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.  దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్ రెబల్  స్టార్ ప్రభాస్ కోసం ఒక కథను సిద్ధం పెట్టుకున్నాడు.సైరా హిట్ తర్వాత  ప్రభాస్ తో  ఓ మంచి సినిమా చేసి మళ్ళీ విజయం సాధించాలి అనుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. 



 అయితే సైరా సినిమాకి ముందే ఓ కథను  ప్రభాస్ కోసం సిద్ధం చేసి పెట్టుకున్నాడు సురేందర్ రెడ్డి. అయితే సైరా సినిమా పూర్తయ్యేసరికి రెబల్ స్టార్ ప్రభాస్ జాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.దీంతో  సినిమా పూర్తయ్యే సరికి చాలా టైం పడుతుంది. దీంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రభాస్ కోసం అనుకున్న కథని ఇటీవలే మెగా  ప్రిన్స్  వరుణ్ తేజ్ వినిపించాడట . అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథ విన్న వరుణ్ తేజ్  కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడట. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ దర్శకుడు సురేందర్రెడ్డి కథ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభాస్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రావాల్సిన  మూవీ కాస్త ప్రస్తుతం సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కబోతుంది . 



 అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటితో ఓ  సినిమాలో   చేయవలసి ఉందని. అయితే సురేందర్రెడ్డి వీనిపించిన కథ వరుణ్ తేజ్ ని ఎక్కువగా ఆకర్షించడంతో సురేందర్రెడ్డి ప్రాజెక్టు తర్వాత కిరణ్ కొర్రపాటితో సెట్స్ పైకి  వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో కిరణ్ కొర్రపాట వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి మరికొంతకాలం వెయిట్ చేయక తప్పేలాలేదు. ఇదిలావుండగా తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ అనే సినిమాలో వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించారు. సినిమాలో మాస్  లుక్  తో అందరికి ఆకర్షించిన వరుణ్ తేజ్... నటుడిగా ఎన్నో మెట్లు ఎదిగిపోయాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అయితే ఈ సినిమాని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: