అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్యారిస్ లో జరిగితున్నది. లిండో స్పెషల్ డ్యాన్స్ ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నది.  సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.   ఇక సినిమా విషయానికి వస్తే.. ఇందులో అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తున్నాడు. తన అక్క టబును ఉన్నత స్థాయి ఇంటిలో ఇవ్వడంతో కథ మొదలౌతుంది.  


అలా పెద్దింటికి వెళ్లిన టబు కుటుంబం కొన్ని చిక్కుల్లో పడుతుంది.  తమ్ముడు అల్లు అర్జున్ ఆ సమస్యలను ఎలా తీర్చాడు అన్నది కథ.  దాదాపుగా మెయిన్ లీడ్ పాయింట్ ఇలానే ఉంటుంది అన్నది టాక్.  ఈ లీడ్ పాయింట్ ను తీసుకొని దాని చుట్టూనే కథను నడుపుతున్నాడు.  ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ...ఇందులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు తగ్గట్టుగా అన్ని రకాల మసాలాలు ఉండబోతున్నాయి.  


బన్నీ సినిమా అంటే అందరు ఇష్టపడేది అతని డ్యాన్స్, ఫైట్స్.. అయితే, ఇందులో మాస్ మసాలా సాంగ్స్ ఉన్నాయా లేదా అన్నది చూడాలి.  ఇప్పటి వరకు రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశారు.  ఒకటి సామజవరగమన... ఇది క్లాసికల్ వే లో ఉండబోతుంది.  రెండోది రాములో రాములా సాంగ్.  ఇది పక్కా ఫోక్ సాంగ్.  ఈ రెండింటిలోను బన్నీ స్టైల్ స్టెప్స్ కు పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చు.  


ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ కొత్త ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు.  ఆ ట్రీట్మెంట్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది తెలియాలి.  ఎవరూ ఊహించని విధంగా ట్రీట్మెంట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  పూజ తో పాటు ఇందులో నివేత పేతురాజ్, అక్కినేని హీరో కూడా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.  మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 12 వరకు ఆగాల్సిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: