ఆయన నటనకి అభిమానులంతా ఫిదా అయిపోతారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కి ఎంత క్రేజ్ వుందో మాటల్లో చెప్పలేము గత ఏడాది బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన ‘జీరో’ సినిమా విడుదలై  బాక్సాఫీస్‌ వద్ద బొల్తాకొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతోన్నా కింగ్‌ఖాన్‌  మళ్లీ థియేటర్‌లలో కనిపించనేలేదు.


దీంతో ఈ రేస్‌ యాక్టర్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? అనే ప్రస్తావన రాగానే మరో ప్రముఖ దర్శకులలతో పాటు ‘రాజ్‌కుమార్‌ హిరాని నుంచి అబ్బాస్‌ జాఫర్‌  సినిమాలకు షారుక్‌ సైన్‌ చేశారు’ అనే వార్తలు సోషల్‌ మీడియాల్లో షికార్లు చేస్తున్నాయి.


అయితే కింగ్‌ ఖాన్‌ వాటన్నింటి పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు .. ‘ప్రస్తుతానికి నేను ఏ సినిమాలకు సైన్‌  చేయలేదని’ ట్వీట్‌ చేశాడు. ఇటీవల ట్విటర్‌లో షారుక్‌ నిర్వహించిన ‘ఆస్క్‌ షారుక్‌ఖాన్‌’ సెషన్‌లో బాద్‌షాను  ఓ అభిమాని ‘మీరు ధూమ్‌ 4 సినిమాకు సంతకం చేశారా?’ అని  అడిగాడు. దానికి కింగ్‌ఖాన్‌  ‘ఇది నేను కూడా విన్నాను... నాకు ఆ సినిమాలో నటించాలనే ఉంది, దీనిపై ఇంకేమైన  వివరాలు వస్తే నాకు తెలపండి’ అంటూ సరదాగా బదులిచ్చారు. 
షారుక్‌ ఖాన్ ఏ పాత్రలో నటించిన ఆ చిత్రం అద్భుతంగా ఉంటుంది.

అభిమానులను ఎంతగానో అలరించే ఎన్నో గొప్ప గొప్ప పాత్రలకు షారుక్ ప్రాణం పోసాడు.  కాగా షారుక్‌ ఖాన్‌ను తన అభిమానులు డిడిఎల్‌జేలో రాహుల్‌గా ప్రేమించారు. అలాగే డర్‌, అంజమ్‌, బాజిగర్‌లతో పాటు డాన్‌ వంటి చిత్రాలలో ప్రతినాయక పాత్రలో కూడా షారుక్‌ మెప్పించాడు. దీంతో యశ్‌రాజ్‌ ‘ధూమ్‌’ సిరీస్‌లో విలన్‌లుగా నటించిన హీరోలు ఆమిర్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, జాన్‌ అబ్రహంల సరసన కింగ్‌ ఖాన్‌ చేరతాడా లేదో  మరి వేచిచూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: