పవన్ కళ్యాణ్, రవి తేజ ఇంకా ఇతర ప్రముఖ నటుల లాగా రానా కూడా పాటలు పాడడం ప్రారంభించాడు. ఇటీవల సంగీత దర్శకుడైన అయినా హిప్‌హాప్‌ ఆది, రానా దగ్గుబాటి తో 'లైట్స్ కెమెరా యాక్షన్' అనే సాంగ్ ని పాడించారు. హిప్‌హాప్‌ ఈ విషయాన్నీ తన ట్వీట్ ద్వారా తెలియజేసాడు. 


'రానా తొలిసారి పాట పాడారు. ఆయన ఈ గీతాన్ని ఎంతో అద్భుతంగా ఆలపించారు. థాంక్యూ రానా అన్న’ అని హిప్‌హాప్‌ పోస్ట్ చేశారు. 'నువ్వు లేకపోతే నేను ఈ సాహసం చేసి ఉండను.. ధన్యవాదాలు’ అని హిప్‌హాప్‌ పోస్ట్ కి రిప్లై ఇచ్చాడు రానా.  ఇంతకీ ఈ సాంగ్ ఎక్కడిదంటే... అది విశాల్ తీస్తున్నా 'యాక్షన్' సినిమాలోనిది. ఈ సినిమాలో తమన్నా విశాల్ సరసన నటిస్తుంది. విశాల్ తమన్నా కలిసి నటిస్తున్న రెండో సినిమా 'యాక్షన్'. వాళ్ళిద్దరు కలిసి నటించిన ఫస్టు తమిళ సినిమా 'కత్తి సందై' విజయం సాధించలేకపోయింది. 


సినిమా కి సి.సుందర్ దర్శకత్వం లో ఆర్ రవీంద్రన్ యొక్క ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. విశాల్ కి తెలుగు లో కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాని తెలుగు లో కి డబ్ చేస్తున్నారు. అయితే తెలుగు వెర్షన్ లో వస్తున్న ఈ సినిమాలోని 'లైట్స్ కెమెరా యాక్షన్' పాటని రానా దగ్గుబాటి ఆలపించారు. కొన్ని రోజుల క్రితం యాక్షన్ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఒకటి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఇది యూట్యూబ్ లో రెండు రోజుల వరకు టాప్ లిస్ట్ లో ఉండటం విశేషం. ఇక ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ అవ్వనున్నది. యాక్షన్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చుడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: