సంక్రాంతి పండగకు సందడిచేయాలని చూస్తున్న సినిమా 'అల వైకుంఠపురములో'.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే  సినివర్గాల్లోనే కాకుండా ఇటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను ఏర్పరచుకున్నది. దీనికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ విషయంలో ఒవర్ స్పీడుతో దూసుకు పోతుంది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆ మధ్య విడుదలైన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట సంచలనాలకు చిరునామాగా మారింది.


తమన్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైనప్పటి నుండి యూ ట్యూబ్‌ను షేక్ చేస్తూనే ఉంది. అంతే కాకుండా ఈ పాట విడుదలైన రోజు నుండే యూ ట్యూబ్‌లో నెం 1గా ట్రెండింగ్ అవుతూ అదరగొడుతుంది.. కాగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ సాంగ్‌కు అధిక సంఖ్యలో లైక్స్ రావడంతో, ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయాయట. ఇకపోతే ఈ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట సాహిత్యపరంగానే కాకుండా చిత్రీక‌ర‌ణ ప‌రంగా కూడా ఈ పాట వెన‌క ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయంటున్నారు.


అదేమంటే పారిస్‌లోని లిడో డాన్స‌ర్ల నేప‌థ్యంలో ఈ పాటను షూట్ చేశారట‌. ఈ లిడో డ్యాన్స‌ర్ల‌కి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఆ ప్ర‌త్యేక‌త‌ను గత 25 యేళ్లుగా కాపాడుకుంటూ వ‌స్తున్నారట. అలాంటి వారితో క‌లిసి ఆడిపాడిన ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ అని చిత్ర‌వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. ఇదే కాకుండా పూజా హెగ్డే కూడా ఈ పాట గురించి సోష‌ల్ మీడియాలో గొప్ప‌గా చెప్పుకొచ్చింది.


ఈఫిల్ ట‌వ‌ర్‌కి ఏమాత్రం తీసిపోని పాట ఇది అంటూ అక్క‌డే అల్లు అర్జున్‌తో క‌లిసి ఒక ఫోటో తీయించుకొంది. ఆ ఫొటోని సామాజిక మాధ్య‌మాల్లో పంచుకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు ఎక్కడలేని హైప్ వచ్చింది. ఈ పాటను తమన్ సంగీతం సారధ్యంలో సిరివెన్నెల సాహిత్యం అందించగా .. సిద్ శ్రీరామ్ పాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: