స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దర్శకధీరుడు రాజమౌళి ఒకే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ భారతదేశమంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలో అక్కడి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా రావాలని అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు కోరుకుంటున్నారు. 
 
కానీ ఎందుకో ఈ కాంబినేషన్ సెట్ కావట్లేదు. నిజానికి బాహుబలి 2 సినిమా తరువాత రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్. సినిమా చేస్తున్నట్లు ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పట్లో అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా రావటం కష్టమేనని తెలుస్తోంది. 
 
రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆర్.ఆర్.ఆర్. తరువాత రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్లో కే ఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ లతో మాత్రం రాజమౌళి ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు. పవన్ కళ్యాణ్ ప్రసుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. 
 
సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోన్నా పవన్ అధికారికంగా ఈ విషయం గురించి స్పందించాల్సి ఉంది. అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు మహేశ్ సినిమా తరువాత రాజమౌళి అల్లు అర్జున్ సినిమాకు దర్శకత్వం వహించాలని, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే పవన్ సినిమాకు కూడా దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: