కష్టాన్ని ఊపిరిగా మార్చుకొని. ఒక్క ఛాన్స్ అంటూ సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరిగి ఎన్నో బాధలను కూడా దిగమింగుకొని సినిమాలలో అవకాశాలను దక్కిచుకొన్న అతి కొద్దీ మందిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా ఒకరు. నువ్వు ని మొహం అంటూ చాలా మంది సినీ దర్శకులు ఆయనను గెంటివేసిన కూడా వెనకడుగు వెయ్యక సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటి సినిమా హిట్ అవ్వకపోయిన అయన నటన చుసిన వారంతా ఆయనకు పిలిచి అవకాశాలు ఇచ్చారు. 


అలా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించి స్టార్ నుండి మెగాస్టార్ గా మంచి పేరును సంపాదించుకున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో జాతీయ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో కూడా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. డెబ్భై పదుల వయసు దాటినా ఆకూడా ఖాళి లేకుండా సినిమాలలో నటిస్తున్నారు. అది బిగ్ బి డెడికేషన్.. 



సినీ ఇండస్ట్రీకి అయన చేసిన సేవలకు గాను ఆయనకు గౌరవ పుష్కరమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వారించినా సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనకు అవార్డు రావడంతో అయన అభిమానులతో పాటుగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆనందాన్ని వ్యక్తం చేశారు. అతినికే ఆ అవార్డు రావాలి అని కొనియాడారు. 


గతంలో చాలా రోజుల నుండి బిగ్ బి లివర్ మరియు గుండె సంబతిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే..అది కేవలం పుకారని అందరూ కొట్టిపారేశారు.. కానీ ఇప్పుడు నిజంగానే బిగ్ బి ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉంది.కోల్ కత్తా ఇంటర్నేషనల్ ఫిలింపెస్టివల్స్‌కి కూడా ఆయన రావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా రాలేకపోయానని అమితాబ్ వెల్లడించారు. అయితే అవన్నీ తర్వాత.. ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి అమితాబ్ అనారోగ్యం బారిన పడటంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.. అమితాబ్ సాబ్ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలని మా ఏపి హెరాల్డ్ గ్రూప్ కూడా ఆ భవంతున్ని ప్రార్దిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: