మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమా, టాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అదిమాత్రమే కాక, ఆ సినిమాను ఒక ఫ్రెంచ్ సినిమాకు కాపీగా కొట్టి తీసారని ఆయనపై పలు విధాలుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తో తీయబోయే అరవింద సమేత సినిమా విషయమై ఎంతో కేర్ తీసుకుని దానిని తెరకెక్కించిన త్రివిక్రమ్, మొత్తానికి ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురంలో అనే సినిమాను తీస్తున్న త్రివిక్రమ్

ఆ సినిమాతో ఎలాగైనా మరొక సక్సెస్ ని తన ఖాతలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే తన సినిమాల విషయమై ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే త్రివిక్రమ్, ఇటీవల అరవింద సమేత సినిమాకు సంబంధించి టైటిల్ లో హీరోయిన్ పేరు కూడా వచ్చేలా డిఫరెంట్ గా నిర్ణయించడం జరిగింది. ఆ సినిమాలో హీరో పేరు వీర రాఘవ కాగా, హీరోయిన్ పేరు అరవింద. ఇక ప్రస్తుతం తెరకెక్కిస్తున్న అలవైకుంఠపురములో సినిమా విషయమై కూడా ఇంచుమించు ఇదే స్ట్రాటజీని త్రివిక్రమ్ ఫాలో అయి టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ ని బట్టి, సినిమాలో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈఓ గా 'అల' అనే అమ్మాయి పాత్రలో పూజ హెగ్డే నటిస్తోందని టాలీవుడ్ వర్గాల టాక్.  

సో, దీనిని బట్టి అరవింద సమేత మాదిరిగా ఈ సినిమా కూడా మంచి అవడం ఖాయమని అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ఒకింత వెరైటీ స్ట్రాటజితో ఈ సినిమా తీస్తున్న త్రివిక్రమ్ ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి. కాగా ఇప్పటికే చివరి దశ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: