అలా వైకుంఠపురములో ప్రస్తుతం మెగా అభిమానులే కాదు టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. అయితే గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావించాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురము  సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్. సినిమాకు స్వరాల మాంత్రికుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా  ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ కి హిట్ పడేలా కనిపిస్తున్నది . 



 అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసాయి. కాగా ఈ  హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. అటు తమను కూడా తన స్వరాలతో అందరిని ఒక ఊపు ఊపేస్తున్నాడు . కాగా  అలా వైకుంటపురములో  సినిమాలో  ఓవైపు స్టైల్ మాంత్రికుడు అల్లుఅర్జున్... మరో వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్... ఇంకోవైపు స్వరమాంత్రికుడు తమన్.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై  ప్రస్తుతం అందరి లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 



 ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే... డాన్సులు ఫైట్లు ఆక్షన్ తో  అదరగొడుతాడన్న విషయం తెలిసిందే. అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మాటలతో మాయ చేసి పంచ్ డైలాగ్లతో ప్రేక్షకులను మైమరిపిస్తుంటాడు . మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన పాటలతో యువతనే  కాదు అటు పెద్ద వాళ్లను సైతం చిందులేయిస్తున్నాడు . అయితే ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అలా  వైకుంఠపురములో  సినిమా ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కి  కూడా మంచి రెస్పాన్స్ కి రాగా ... తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ షేక్ చేసి రికార్డు సృష్టించాయి. కాగా  ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే, హాట్ బ్యూటీ నివేత పేతురాజ్ నటిస్తున్నారు. ఇక ఈ  హిట్ కాంబినేషన్ మరోసారి భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని మెగా అభిమానులు అనుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: