టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. రూపంలో ముమ్మూర్తులా తండ్రిని పోలి ఉండే సితార, చిన్నప్పటినుండి ఎంతో చలాకీగా మరియు ఉత్సహంగా ఉంటుంది. ఇక ఆమెకు సంబందించిన పలు విషయాలను అప్పుడప్పుడు మహేష్ మరియు నమ్రతలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకున్న సితార, కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురైన ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, అప్పుడప్పుడు పలు వీడియోలు పోస్ట్ చేస్తూ, మంచి పేరు సంపాదిస్తోంది. 

ఇకపోతే ఆయన తనయుడు గౌతమ్ కూడా సితార లానే ఎంతో ఉత్సాహంగా ఉండడంతో పాటు ఇటీవల తన సెమినార్ ద్వారా ఒక అవార్డు కూడా గెలుచుకున్నట్లు నమ్రత గారు కొద్దిరోజుల క్రితం తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక గౌతమ్, తన తండ్రి మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా బాలనటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే సితార మాత్రం ఇప్పటివరకు సినిమా రంగ ప్రవేశం మాత్రం చేయలేదు. ఇక ఎట్టకేలకు ఆమె సినిమాల్లోకి ప్రవేశించే ముహూర్తం ఖరారయింది. అయితే నటిగా కాదు వాయిస్ ఓవర్ ద్వారా. కొన్నాళ్ల క్రితం హాలీవుడ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన యానిమేషన్ మూవీ ఫ్రోజెన్. ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ఫ్రోజెన్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలోని 'ఎల్సా' పాత్ర తెలుగు వర్షన్ కు సితార తన వాయిస్ ని అందించనున్నట్లు డిస్నీ సంస్థవారు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ప్రకటన రిలీజ్ చేసారు. దీనితో సితారపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సహా పలువురు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలిసారి హాలీవుడ్ మూవీకి సితార వాయిస్ అందించడం నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం అని, ఫ్రోజెన్ 2 సినిమా మంచి సక్సెస్ సాధించి సితారకు భవిష్యత్తులో మంచి అవకాశాలు అందించాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారు కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: