బోనీ కపూర్‌ బాలీవుడ్‌లో ఎంతో పేరుప్రఖ్యాతలు గల గొప్ప నిర్మాత .ఈ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ నేటితో 64వ సంవత్సరంలోకి  అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎందరో బాలీవుడ్‌ ప్రముఖులు, సన్నిహితులు శుభకాంక్షలు తెలిపారు. కాగా, దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్‌ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌  సోషల్‌ మీడియా వేదికగా తన తండ్రికి విషెస్‌ తెలిపారు. జాన్వీ కపూర్‌ తన తండ్రిపై వున్న భావాలన్నీతెలియచేసింది ప్రస్తుతం ఇది ఇన్‌స్టా పోస్టు అన్నిటిలో ప్రత్యేకంగా నిలిచింది.


అస్సలు జాన్వీ కపూర్‌ ఏమని  పోస్ట్లు చేసిందంటే ‘హ్యాపీ బర్త్‌ డే పప్పా, నువ్వు నన్ను ఎప్పుడూ అడుగుతుంటావు. ఇంత ఎనర్జీ ఎలా సాధ్యమని. దానికి కారణం మీరే. మీరే నా బలం పప్పా.  ప్రతిరోజూ, ప్రతిక్షణం మిమ్మల్ని చూసే ఎలా ఉండాలో నేర్చుకుంటాను.


ప్రతి క్షణం మీరు మాపై కురిపించే ప్రేమ, మీరు కొన్నిసార్లు ఇబ్బందులకు గురైనా.. తిరిగి అంతకు రెట్టింపు వేగంతో మరింత శక్తిమంతంగా పుంజుకోవడం.. మీరు కృంగిపోతున్న సమయంలో కూడా మేం పడిపోకుండా మీ మాటలతో మాకు  బలాన్ని, ధైర్యాన్నికూడా  ఇస్తావు..  నీ కంటే ఉత్తమమైన వ్యక్తిని  ఈ లోకంలోచూడలేదు. లవ్‌ యూ పప్పా’. అంటూ జాన్వీ పోస్ట్‌ చేసారు . అలాగే మీరు ప్రతి విషయంలోను మాకు దైర్యంగా నిలిచారు.


 అలాగే ‘నా ప్రతి విషయంలో స్నేహితుడిలా సలహాలు ఇస్తూ... నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, ఎల్లప్పుడు వెన్నంటే ఉండే మీరు ఉత్తమమైనా తండ్రే కాదు.. ఓ మంచి స్నేహితుడు కూడా.. మిమ్మల్ని చుసే పెరిగాము ఈ సొసైటీ లో ఎలా  ఎదగాలో ఎలా  మెలగాలో నేర్చుకున్నాము .  ఐ లవ్‌ యూ డాడీ’  అంటూ హృదయాన్ని తాకే సందేశంతో బోనీ కపూర్‌కు జాన్వీ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: