మాటల మాంత్రికుడుగా త్రివిక్రం పేరు గడించారు. ఆయన సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం స్వయంవరం చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయం అయ్యారు. త్రివిక్రం సినిమాల్లో పాత్రలు  మనసుతో మాట్లాడుతాయి. గుండె గొంతుకను వినిపిస్తాయి. మానవ సంబంధాలు   ఎలా ఉంటాయో, పరిస్థితులు వల్ల అవి ఎలా మారిపోతాయో త్రివిక్రం సినిమాల్లో చూపించినట్లుగా ఎవరూ చూపించలేదు. ఇక ఆయన అందరూ హీరోలతోనూ సినిమాలు తీశారు.


బన్నీతో ఇప్పటికి రెండు సినిమాలు తీస్తే రెండూ హిట్టే. ఈ ఇద్దరి కాంబో మొదటిగా జులాయితో మొదలైంది. ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి తో మరో హిట్ కొట్టారు. ఇపుడు ముచ్చటగా మూడవసారి అల వైకుంఠపురంలో సినిమాతో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ ఇద్దరి కలయిక ప్రతీసారీ సరి కొత్త మ్యాజిక్ ని క్రియేట్ చేస్తోంది. ఈ ఇద్దరూ కలిస్తేనే  చాలు సెన్సేషన్ అంటారంతా.


ఇపుడు అల వైకుంఠపురానికి పెద్ద ఎత్తున  పాజిటివ్ బజ్ వచ్చేసింది. సాంగ్స్ అదరహో అంటున్నాయి. సామజవరగమనా సాంగ్ అతి పెద్ద  రికార్డ్ క్రియేట్ చేసింది. రాములో రాములా సాంగ్ మాస్ కి బాగా ఎక్కేసింది. సినిమా రిలీజ్ కి రెండు నెలల టైం ఉండగానే ఈ మూవీ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక త్రివిక్రం అరవింద సమేత మూవీతో ఫాం లో ఉన్నాడు. బన్నీ మంచి కసి మీద ఉన్నాడు. 


ఈ ఇద్దరూ దున్నేయడం ఖాయమని సినీ వర్గాల నుంచి కూడా మాట వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి త్రివిక్రం మంచి విందు భోజనమే రెడీ చేశారని అంటున్నారు. మరి ఈ జోడీ కొత్త  బెంచ్ మార్క్ సెట్ చేసి పెడుతుందా అన్నది కూడా సినీ పండితుల ఆలోచనగా ఉంది. ఈ దెబ్బతో బనీ బ్లాక్ బస్టర్ కోరిక తీరడం ష్యూర్ అంటున్నారు. సో అంతా వెయిటింగ్ మరి అల వైకుంఠపురంలో మూవీ కోసం.



మరింత సమాచారం తెలుసుకోండి: