గత కొంత కాలంగా చూస్తుంటే తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఢ‌మాల్‌ మని పడిపోతూ వస్తోంది. బాహుబలి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ బావుంది అనుకుంటే ఇంతలోనే ఇది ఊహించని పరిణామం. వాస్త‌వానికి నాని లాంటి హీరోలు సైతం ఎంతో సులువుగా అక్కడ 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసేవారు. కానీ ఇప్ప‌డు ప‌రిస్థితి మొత్తం రివ‌ర్స్‌గా మారింది. మెగా స్టార్ చిరంజీవి లాంటి సీనియ‌ర్ హీరోలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు తీసినా కూడా అక్కడ ఆ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసేందుకు  ఆపసోపాలు పడాల్సి వచ్చింది.


అయితే అసలెందుకు ఓవర్సీస్ బాక్సాఫీస్ ఇటీవల దారుణ ఫలితాల్ని ఎదుర్కొంటోంది..? అంటే రకరకాల కారణాలు చెబుతున్నారు. ఓవర్సీస్ బయ్యర్లు పంపిణీదారులకు సినిమాలపై సరైన జడ్జిమెంట్ లేకపోవడం ఒక కారణం అనుకుంటే అక్కడ సిండికేట్ మాఫియా కనుసన్నల్లో సినిమాని రిలీజ్ చేయాల్సి రావడంపైనా గత కొంతకాలంగా ఆందోళన నెలకొంది. కొత్త పంపిణీదారుల్ని రానివ్వని మాఫియా కూడా అక్కడ తయారైందన్న వార్త నిర్మాతల్ని భయపెడుతోంది. అయితే  ప్రస్తుతం తెలుగు సినిమా నిర్మాతల్లో ఈ ప్రత్యేక టాపిక్  కొన‌సాగుతోంది. 


ఆగ్ర హీరోల సీనిమాలు.. పాన్ ఇండియా సినిమాలు కూడా ఇక్క‌డ దారుణంగా చతికిల బడ్డాయి. ఇక పెద్ద సినిమాల బాటలోనే చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలు ఫెయిలవుతూనే ఉన్నాయి. పంపిణీదారుడికి పెట్టిన పెట్టుబడిని అయినా తిరిగి ఇవ్వలేని దుస్థితి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు 2020 సంక్రాంతికి రిలీజ్ కానున్న అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలు మినహా ఇతర సినిమాలకు ఓవర్సీస్ ఎఫెక్ట్ ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అయితే వేటికీ సరైన బిజినెస్ అవ్వక నిర్మాతల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: