ఈ మధ్యకాలంలో అబ్బాయిలు అందరూ.. ఏదో అమ్మాయిలు టార్చర్ చేస్తున్నట్టు.. ఆ టార్చర్ మాకు లేదు రా బాబు అంటూ సింగిల్స్ డే రాకముందు నుంచే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆలా చాల మంది.. టెన్త్ క్లాస్ పిల్లాడి నుండి.. పెళ్లయి విడాకులు తీసుకున్న వారు వరుకు అందరూ సోషల్ మీడియా వేధికగా సింగిల్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 


ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కూడా సింగిల్స్ డే పై సంచలన ట్విట్ చేశాడు. మాములుగా అయితే ఆ ట్విట్ పెద్ద వైరల్ అవ్వదు. కానీ మనోజ్ ఇప్పుడు పెట్టిన ట్విట్ వైరల్ అవుతుంది, ఎందుకంటే మంచు మనోజ్ ఇటీవలే తన రెండేళ్ల వివాహబంధానికి విడాకులతో ముగింపు పలికాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ప్రకటించాడు. తనకు తన భార్యకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని.. వాటివల్ల ఇద్దరు చాలా నొప్పిని భరించమని అందుకే విడిపోతున్నాం అని అయన అన్నాడు. 


అయితే ఈరోజు సింగిల్స్ డే కావడంతో మంచు మనోజ్ ట్విట్టర్ వేధికగా 'నన్ను నేను ప్రేమించుకుంటున్నను' ఐ లవ్ మి సింగిల్స్ డే' అని ట్విట్ పెట్టాడు. దీంతో ఇప్పుడు ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాదు ట్విట్టర్ వేధికగా నెటిజన్లు కూడా సింగిల్స్ పై సినిమా తియ్యు అన్న అంటూ ట్విట్ చేస్తున్నారు. కాగా మంచు మనోజ్ కూడా విడాకుల తర్వాత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. ఇకపై తన ద్యాస అంత సినిమాపైనే ఉంటుంది అని చెప్పాడు. మరి మనోజ్ ఫ్యాన్స్ కోరినట్టు సింగిల్స్ పై సినిమా తీస్తాడు ఏమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: