వచ్చే సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న రెండు సినిమాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురంలో సినిమా ఒకటి. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా ఫలితం తర్వాత బన్నీ చాలా కేర్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాపై మెగా, బన్నీ అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్ బజ్ క్రియేట్ చేశాయి. కార్పొరేట్ ఆఫీస్, పల్లెటూరి గెటప్ లో ఉన్న బన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాడు.

 


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న అల.. వైకుంఠపురంలో సినిమాకు టైటిల్ లో మొదటి అక్షరం సెంటిమెంట్ గా నిలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ’ అక్షరంతో వచ్చిన సినిమాల్లో ఒక్క అజ్ఞాతవాసి తప్ప మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాల్నే రాబట్టాయి. ‘అతడు, అత్తారింటికి దారేది, అరవింద సమేత..’ సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు సూపర్ హిట్టయ్యాయి. బన్నీ కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా, గత అనుభవాల దృష్ట్యా త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే స్టోరీ కాబట్టి అభిమానుల్లో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 


సంక్రాంతి రేసులో నిలిచే ఏ సినిమాకైనా దాదాపు కలెక్షన్లు బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వెళ్లే సీజన్ కాబట్టి త్రివిక్రమ్ స్టైల్ కథ, కథనాలతో సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చెప్తున్నాయి. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన గత రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అల.. తో హ్యాట్రిక్ కొట్టాలని బన్నీ-త్రివిక్రమ్ కృషి చేస్తున్నారు. మరి ‘అ’ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ఏమేరకు అంచనాలు అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: