అక్కినేని సమంత ఈ సంవత్సరం మజిలీ, ఓ బేబి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. మజిలీ సినిమాలో చైతూ కి జోడీగా నటించి ఒకరకంగా తన భర్తనే డామినేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తన దగ్గరకు వస్తున్న కథలలో తన పాత్ర ఎంతో డిఫ్రెంట్ గా ఉంటే గాని 'ఎస్' చెప్పడం లేదు. బోల్డ్ క్యారెక్టర్ అయినా సరే సై అంటోంది. కానీ ఆ క్యారెక్టర్ కూడా ఇంతకముందు ఎవరు చేయనిదిగా ఉండాలని కండీషన్ పెడుతోంది. దీన్నీ బట్టీ చూస్తుంటే సమంత తన క్యారెక్టర్ ఎంత డిఫ్రెంట్ గా, ఛాలెంజింగ్ గా ఉండాలనుకుందో అర్థమవుతోంది. అందులో బాగంగానే ఇప్పటి వరకు చేయని ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. 

'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఇప్పటి వరకు గ్లామరస్ హీరోయిన్‌గా, లీడ్ యాక్టర్‌గా మాత్రమే నటించారు. కానీ ఇప్పుడు మొదటిసారి నెగిటివ్ రోల్‌లో నటించబోతున్నారు. అది కూడా ఒక వెబ్ సిరీస్‌లో. సమంత వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారనే విషయం ఇప్పటికే తెలిసిన సంగతి. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌లో సమంత కీలక పాత్రలో నటించనున్నట్లు ఇదివరకే క్లారిటి ఇచ్చింది. అయితే ఈ సిరీస్‌లో సమంత టెర్రరిస్టుగా కనిపించనున్నట్లు సమాచారం. 

మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ 'ది ఫ్యామిలీ మ్యాన్' ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాపులర్ హిందీ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లోనే సమంత నటిస్తోంది. ఇందులో సమంత పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉందట. అంతేకాదు సమంత పోషించేది టెర్రరిస్ట్ పాత్ర కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే సమంత షూటింగ్‌లో పాల్గొంటారని లేటెస్ట్ న్యూస్. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: