టాలీవుడ్ లోకి ఇప్పటి వరకు ఎంతో మంది మెగా హీరోలు గా వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  కానీ ఈ మూవీ కన్నా ముందుగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ నటనకు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. డ్యాన్స్, ఫైట్స్ లో మెగా హీరో జోష్ చూపించాడు. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.  మొదటి నుంచి మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన సాయిధరమ్ తేజ్ గతకొంత కాలంగా వరుసగా ఫెయిల్యూర్స్ పొందుతున్నాడు. 

ఈ ఏడాది చిత్రలహరి మూవీతో కాస్త పరవాలేదు అనిపించుకున్నాడు. వరుసగా అపజయాలు పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఈసారి తన స్టైల్ మార్చారు..ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల వైపు దృష్టి పెట్టారట.  ఈ నేపథ్యంలో రూపొందుతున్న 'ప్రతిరోజూ పండగే' సినిమా వచ్చేనెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందమైన కుటుంబం నేపథ్యంలో ‘ప్రతిరోజూ పండగే’ మూవీ రూపొందినట్లు కనిపిస్తుంది.  ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. 

ఇటీవల టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు..ఈ పాట కూడా బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ యంగ్ మెగా హీరో  ‘సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ  తేజు జోడీగా నభా నటేశ్ నటించనుంది. కొద్ది సేపటి క్రితం ‘హ్యాపీ సింగిల్స్ డే' అంటూ ఈ సినిమా నుంచి తేజు ఒక పోస్టర్ వదిలాడు.  సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బహుశా వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: