ఒకే ఒక్క సాంగ్... విడుదలయి నెల రోజులు అవుతున్నా సోషల్ మీడియా కు నిద్ర పట్టకుండా చేస్తుంది. యూట్యూబ్ ను నిరంతరం ఉరకలెత్తుతోంది. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా... అంటూ రిలీజ్ చేసిన ఈ పాటని రోజుకు ఒక్కసారి అయినా వినకుండా మన యూత్ ఆగలేకపోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన అద్భుతమైన బాణీలకు లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటను ఎవరు అందుకోలేని స్థానంలో నిల్చోపెట్టాయి. సిద్ శ్రీరామ్ సెన్సేషనల్ వాయిస్ తో విడుదలైన ఈ పాటను యువత ఆలపించకుండా ఉండలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

అయితే టాలీవుడ్ హీరోల అందరిలో సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న బన్నీ చిత్రాలు  హిందీలో డబ్ అవుతూ మిలియన్ వ్యూస్ సోషల్ మీడియాలో కూడా క్రాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సామజవరగమన పాటను దాదాపు 50 లక్షల మందికి పైగా యూట్యూబ్లో వీక్షించారు. ఇక కాలర్ ట్యూన్ మరియు రింగ్ టోన్ లగా పెట్టుకున్న వారి సంఖ్య కి అయితే లెక్కేలేదు. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్, 313 వేల లైకులు రావడం గమనార్హం. అలాగే ఇప్పటి వరకు వచ్చిన వ్యూస్ మరియు లైక్స్ చూస్తే తెలుగులో ఒక పాటకు ఇంత మొత్తంలో రావడం ఇదే ప్రథమం.

ఇప్పుడు ఆ సాంగ్ యొక్క రేంజ్ కు తగ్గట్టుగానే ఆ సాంగ్ చిత్రీకరణ చాలా ఐకానిక్ ప్రదేశాల వద్ద అల వైకుంఠ పురం లో చిత్రబృందం చిత్రిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఐఫిల్ టవర్ వద్ద మరియు చాలా పాపులర్ ద్వీపం అయిన మౌంట్ సైంట్ మిచెల్ వద్దా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా ప్యారిస్ లో చాలా ఫేమస్ అయిన కాబరెట్ షో లో కూడా ఈ పాటలో కొంత మొత్తాన్ని తీస్తుండగా... అక్కడ చిత్రీకరిస్తున్న మొట్టమొదటి దక్షిణ భారత చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే భారతదేశం మొత్తంలో అక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్న రెండవ పాట ఇది. రానున్న రోజుల్లో ఈ పాట ఎన్ని రికార్డులు సాధిస్తుంది మరియు ఆ చిత్ర ఘన విజయం లో ఎటువంటి పాత్ర పోషిస్తుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: